Teacher recruitment scam: నా ఇళ్ళలో దొరికిన డబ్బు నాది కాదు.. నాకు తెలియకుండా పెట్టారు: అర్పిత
ఈడీ జరిపిన సోదాల్లో భాగంగా పశ్చిమ బెంగాల్ తాజా మాజీ మంత్రి పార్థ ఛటర్జీ సహాయకురాలు అర్పితా ముఖర్జీ ఇళ్ళలో కోట్లాది రూపాయలు బయటపడ్డ విషయం తెలిసిందే. అయితే, ఆ డబ్బు తనది కాదని ఇటీవలే పార్థ ఛటర్జీ అనగా, ఇప్పుడు అర్పితా ముఖర్జీ కూడా ఆ డబ్బు తనది కాదని చెబుతోంది. ''ఆ నగదు నాది కాదు.. నాకు తెలియకుండా ఆ డబ్బుని అక్కడ ఎవరో పెట్టారు'' అని ఆమె వ్యాఖ్యానించింది.
- T Venkateshwarlu
- Published On : August 2, 2022 / 12:07 PM IST
Teacher recruitment scam: పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఉపాధ్యాయ నియామక కుంభకోణానికి సంబంధించి నగదు అక్రమ చలామణి కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ కొనసాగిస్తోంది. ఈడీ జరిపిన సోదాల్లో భాగంగా పశ్చిమ బెంగాల్ తాజా మాజీ మంత్రి పార్థ ఛటర్జీ సహాయకురాలు అర్పితా ముఖర్జీ ఇళ్ళలో కోట్లాది రూపాయలు బయటపడ్డ విషయం తెలిసిందే. అయితే, ఆ డబ్బు తనది కాదని ఇటీవలే పార్థ ఛటర్జీ అనగా, ఇప్పుడు అర్పితా ముఖర్జీ కూడా ఆ డబ్బు తనది కాదని చెబుతోంది.
అర్పితా ముఖర్జీ తాజాగా మాట్లాడుతూ… ”ఆ నగదు నాది కాదు.. నాకు తెలియకుండా ఆ డబ్బుని అక్కడ ఎవరో పెట్టారు” అని ఆమె వ్యాఖ్యానించింది. కోల్‌కతాలోని అర్పితా ముఖర్జీ ఇళ్ళలో ఇప్పటివరకు రూ.49.8 కోట్ల నగదు, పెద్ద ఎత్తున బంగారం దొరికిది. ఈడీ అధికారులు సోదాలు చేస్తున్న కొద్దీ డబ్బు బయటపడుతుండడం విస్మయం కలిగిస్తోంది.
అర్పితా ముఖర్జీకి సంబంధించిన మూడు సంస్థల నగదు చలామణీ గురించి ఈడీ అధికారులు విచారణ జరుపుతున్నారు. కాగా, తనపై కొందరు కుట్రలకు పాల్పడుతున్నారని, ఇందుకు సంబంధించిన అన్ని అంశాలూ సరైన సమయం వచ్చినప్పుడు అందరికీ తెలుస్తాయని పార్థ ఛటర్జీ ఇటీవలే అన్నారు. అర్పిత ఇళ్ళలో దొరికిన డబ్బు తనది కాదని స్పష్టం చేశారు. ఈడీ సోదాల నేపథ్యంలో పార్థ ఛటర్జీ మంత్రి పదవిని కోల్పోయారు. ప్రస్తుతం ఆయనను, అర్పితా ముఖర్జీని ఈడీ విచారిస్తోంది. ఇందులో భాగంగా అనేక విషయాలు బయటకు వస్తున్నాయి.
CJI Justice NV Ramana : ‘మహారాష్ట్ర’ వివాదంపై సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు
