Komati Reddy Brothers in Delhi : ఢిల్లీలో కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయాలు..అమిత్ షాతో భేటీ

మునుగోడులో ముసలం పెట్టిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఢిల్లీలో బీజేపీ నేతలతో భేటీ కానున్నారు. అంతేకాదు కోమటిరెడ్డి బ్రదర్స్ ఢిల్లీలో రాజకీయ భేటీల్లో బిజీ బిజీగా ఉన్నారు. ఇప్పటికే మునుగోడు నియోజకవర్గం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి బ్రదర్స్ లో ఒకరైన రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరే విషయం పార్టీ అగ్రనాయకులు జేపీ నడ్డా, అమిత్ షాలతో భేటీ అయి చర్చించనున్నారు.

Komati Reddy Brothers in Delhi : మునుగోడులో ముసలం పెట్టిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఢిల్లీలో బీజేపీ నేతలతో భేటీ కానున్నారు. అంతేకాదు కోమటిరెడ్డి  బ్రదర్స్ ఢిల్లీలో రాజకీయ భేటీల్లో బిజీ బిజీగా ఉన్నారు. ఇప్పటికే మునుగోడు నియోజకవర్గం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి బ్రదర్స్ లో ఒకరైన రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరే విషయం పార్టీ అగ్రనాయకులు జేపీ నడ్డా, అమిత్ షాలతో భేటీ అయి చర్చించనున్నారు. మరికాసేపట్లో వీరి భేటీ కానున్నారు. అంతేకాకుండా కోమట్టి రెడ్డి వెంకట రెడ్డి కూడా అమిత్ షాతో భేటీ కానున్నారు. వెంకట్ రెడ్డి అమిత్ షాతో భేటీతో తెలంగాణ కాంగ్రెస్ లో కాకరేపుతోంది. ఆయన కూడా తమ్ముడి బాటలోనే నడవనున్నారా? బీజేపీ చేరటానికి మంతనాలు జరుపుతున్నారా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. కానీ తెలంగాణకు వరద సహాయం చేయాలని కోరటానికి మాత్రమే తాను అమిత్ షాతో భేటీ అవ్వటం వెనుక ఉన్న కారణం అని వెంకట్ రెడ్డి చెబుతున్నారు.

రాష్ట్రంలో ఇటీవల కాలంలో వచ్చిన భారీ వర్షాలతో వచ్చిన వరదలకు తీవ్ర నష్టం ఏర్పడింది. దీంతో వరద కష్టంలో ఉన్న ప్రజలను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరటానికే అమిత్ షాతో భేటీ కావటానికి అపాయింట్ మెంట్ కోరానను చెబుతున్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.కాగా..కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శుక్రవారం (ఆగస్టు 5,2022) ఉదయమే ఢిల్లీకి చేరుకున్నారు. బీజేపీ అగ్రనేతలతో భేటీ కానున్నారు. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో బహిరంగ సభ ఏర్పాటు చేయాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భావిస్తున్నారు. ఈ సభకు రావాలని అమిత్ షా ను ఆహ్వానిస్తున్నారు. ఈ సభలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరే అవకాశం ఉంది. ఈ విషయమై చర్చించేందుకు రాజగోపాల్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు.

అమిత్ షా అపాయింట్ మెంట్ ను కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అడిగారు. మరో వైపు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా కేంద్ర మంత్రి అమిత్ షా తో భేటీ కోసం అపాయింట్ మెంట్ అడిగారు. పార్లమెంట్ లోని తన చాంబర్ లో మధ్యాహ్నం 2.30 గంటలకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అమిత్ షా అపాయింట్ మెంట్ ఇచ్చారు. ఈ సమయంలో రాష్ట్రంలో వరదలతో పాటు లోన్ యాప్స్, ఇతర సమస్యలపై అమిత్ షాతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చర్చించనున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు