ED and IT raids on TRS MP Gayathri ravi Office In Hyderabad
ED, IT raids on TRS MP Gayathri ravi Office : అధికార టీఆర్ఎస్ నేతలపై ఈడీ,ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఈక్రమంలో టీఆర్ఎస్ ఎంపీ గాయత్రి రవి ఆఫీసులో ఈడీ,ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని ఎంపీ గాయత్రి రవి కార్యాలయంలో 11 గంటలుగా సోదాలు చేస్తున్నారు ఈడీ, ఐటీ అధికారులు. హైదరాబాద్‌తో పాటు కరీంనగర్ కార్యాలయంలోనూ తనిఖీలు చేస్తున్నారు. దీంతో టీఆర్‌ఎస్ పార్టీలో కలవరం నెలకొంది.
తెలంగాణ రాష్ట్రంలో మైనింగ్ వ్యవహారాలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఆదాయపు పన్ను విభాగం (ఐటీ) కరీంనగర్ లోని ఆరు చోట్ల గ్రానైట్ సంస్థల కార్యాలయాల్లో తనిఖీలు చేసిన విషయం తెలిసిందే. మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లోనూ దాడులు చేశారు అధికారులు. మంత్రి గంగుల ఇంట్లో లేని సమయంలో ఆయన ఇంటి తాళాలు పగులగొట్టి మరీ అధికారులు సోదాలు నిర్వహించారు.
ఇలా గత కొంతకాలంలో హైదరాబాద్ లో రాజకీయ నేతలు..వ్యాపారవేత్తల ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ,ఐటీ అధికారులు దాడులు కొనసాగిస్తున్నారు. లిక్కర్ స్కామ్ వ్యవహారంలో రెండు తెలుగు రాష్ట్రాలలతో పాటు పలు రాష్ట్రాల్లో అధికారుల దాడులు కొనసాగుతున్నాయి.