Excise police warn to pubs : నో DJ, నో లైవ్ బ్యాండ్‌..పబ్ లకు ఎక్సైజ్ శాఖ వార్నింగ్

హైదరాబాద్ నగరంలో పబ్ లకు ఎక్సైజ్ శాఖ వార్నింగ్ ఇచ్చింది. ఇష్టమొచ్చినట్లుగా సౌండ్ లతో రచ్చ చేస్తే ఊరుకునేది లేదని..నో డీ జే & నో లైవ్ బ్యాండ్‌ అంటూ వార్నింగ్ ఇచ్చింది.

Excise police warn to pubs : హైదరాబాద్ నగరంలో వేలాది పబ్ లున్నాయి. తెల్లవార్లు పబ్ లు మోత మోగిస్తుంటాయి. తీవ్ర స్థాయిలో సౌండులు…డాన్సులు, లైవ్ బ్యాండ్ లతో ఊదరగొడుతుంటాయి. ఇది ఆయా ప్రాంతాల్లోని స్థానికులకు ఇబ్బందికరంగా మారుతోంది. దీంతో నగరంలోని పబ్ లకు ఎక్సైజ్ శాఖ వార్నింగ్ ఇచ్చింది. ఇష్టమొచ్చినట్లుగా సౌండ్ లతో రచ్చ చేస్తే తాట తీస్తామంటూ వార్నింగ్ ఇచ్చింది.

ఇష్టమొచ్చినట్లుగా సౌండ్లు, లైట్స్, రణగొణ ధ్వనులతో పబ్ కార్యకలాపాలు నిర్వహిస్తూ ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే ఊరుకునేది లేదంటూ హైదరాబాద్ నగరంలో నీ పబ్ లకు సౌండ్ పై ఆదేశాలు జారీ చేసింది ఎక్సయిజ్ శాఖ. సౌండ్ తో పాటు లైవ్ బ్యాండ్ పై కూడా ఆంక్షలు విధించింది ఎక్సైజ శాఖ. పబ్ లో సౌండ్ పొల్యూషన్ పై ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించింది.

నగరంలోని ఆయా ప్రాంతాల్లోని పబ్ లలో శబ్ద కాలుష్యాన్నినివారించాలనే ఉద్ధేశంతో జూబ్లీహిల్స్ ఎక్సైజ్ నిర్ణయించింది. పబ్ లలో సౌండులు ఇబ్బంది కలిగిస్తే వెంటనే 100కి డయల్ చేయాలని నగర ప్రజలకు సూచించింది. జూబ్లీహిల్స్ ఎక్సైజ్ పోలీసులు పలు క్లబ్‌లు, పబ్‌ల్లో తీవ్రంగా సౌండ్ చేసేవాటిపై ఇప్పటికే వార్నింగ్ లు జారీ చేసినట్లుగా సమాచారం. శబ్ద కాలుష్యాన్ని నియంత్రించే భాగంలో ఇటువంటి నిర్ణయం తీసుకుంది ఎక్సైజ్ శాఖ.

కానీ కొన్ని ఎక్కువ వాల్యూమ్‌లతో పబ్ లు నడుస్తున్నాయనే సమాచారంతో మరోసారి ఆదేశాలు జారీ చేసింది. నగరంలోతీ పబ్‌లలో నో డీ జే & నో లైవ్ బ్యాండ్‌ ఆదేశాలు జారీ చేశారు ఎక్సైజ్ పోలీసులు. డెసిబుల్స్ తక్కువగా ఉండేలా చూడాలని క్లబ్‌ల యజమానులను కోరారు జూబ్లీహిల్స్ ఎక్సైజ్ పోలీసులు.

 

ట్రెండింగ్ వార్తలు