నాయిని ఇంట మరో విషాదం.. వారంలోపే కన్నుమూసిన భార్య

  • Publish Date - October 27, 2020 / 07:09 AM IST

Nayani Narasimha Reddy:తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, టీఆర్‌ఎస్‌ నాయకులు నాయిని నర్సింహారెడ్డి కన్ను మూసి వారం కాకముందే వారి కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. నాయిని భార్య అహల్య(68) కన్నుమూశారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె చనిపోయారు. నాయిని ఈ నెల 22న మరణించిన విషయం తెలిసిందే. ‌ఇటీవల నాయిని, ఆయన భార్య అహల్య ఇద్దరు కూడా కరోనా బారిన పడ్డారు. దీంతో ఇద్దరు హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరగా.. భర్త నాయిని నర్సింహ రెడ్డి తీవ్ర అనారోగ్యంతో చనిపోయారు.



చనిపోయిన నాయిని ఆఖరి చూపుకు అహల్యను కుటుంబ సభ్యులు అంబులెన్స్‌లో తీసుకొని రాగా.. ఆమెకు కరోనా నెగటీవ్‌ కూడా వచ్చింది. అయితే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే సోమవారం(26 అక్టోబర్ 2020) చనిపోయారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా ఆమె తుది శ్వాస విడిచారు.



https://10tv.in/leader-nayini-narsimha-reddy-life-history/
నాయిని కూడా కరోనా నుంచి కోలుకుని నిమోనియాతో చనిపోయారు. ఆయన కడచూపు కోసం అహల్య వీల్ చెయిర్‌లోనే వచ్చారు. నాయిని, అహల్య దంపతులకు దేవేందర్ ‌రెడ్డి, సమంత రెడ్డి సంతానం. అల్లుడు శ్రీనివాస్‌ రెడ్డి ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్‌గా ఉన్నారు. కూతురు సమంత న్యాయవాద వృత్తిలో పనిచేస్తున్నారు.