Telangana Holidays List 2023 : 28 రోజులు సెలవులు, ఆదివారం వచ్చిన ఆ 3 పండుగలు..తెలంగాణలో 2023 ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల

వచ్చే ఏడాది అంటే 2023 సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ సెలవు దినాల జాబితాను తెలంగాణ సర్కార్ విడుదల చేసింది. జనరల్ సెలవులు, ఆప్షనల్ సెలవులు, వేతనంతో కూడిన సెలవుల లిస్ట్ ను ప్రకటించింది. 2023లో మొత్తం 28 జనరల్ (సాధారణ) సెలవులు ఉన్నాయి. 24 ఆప్షనల్ (ఐచ్ఛిక) హాలీడేస్ ఉన్నాయి.

Telangana Holidays List 2023 : వచ్చే ఏడాది అంటే 2023 సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ సెలవు దినాల జాబితాను తెలంగాణ సర్కార్ విడుదల చేసింది. జనరల్ సెలవులు, ఆప్షనల్ సెలవులు, వేతనంతో కూడిన సెలవుల లిస్ట్ ను ప్రకటించింది. 2023లో మొత్తం 28 జనరల్ (సాధారణ) సెలవులు ఉన్నాయి. 24 ఆప్షనల్ (ఐచ్ఛిక) హాలీడేస్ ఉన్నాయి.

ప్రభుత్వ ఉద్యోగులు సాధారణ సెలవులతో పాటు ఉన్నతాధికారుల అనుమతితో 5 మాత్రమే ఆప్షనల్ హాలిడేస్ పొందవచ్చని ప్రభుత్వం పేర్కొంది. వాటితో పాటు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పండగల కోసం, స్పెషల్ డేస్ కోసం 23 నోటిఫైడ్ సెలవులున్నాయి. ఇవన్నీ కూడా వేతనంతో కూడిన సెలవులుగా ఉత్తర్వుల్లో పేర్కొంది ప్రభుత్వం.

కాగా, ఏప్రిల్ నెలలో అత్యధికంగా 16 రోజులు (5 జనరల్+5 ఆప్షనల్+1 రెండో శనివారం,5 ఆదివారాలు) సెలవులు ఉంటాయి. ఏప్రిల్ 5న బాబూ జగ్జీవన్ రామ్ జయంతి. ఏప్రిల్ 7న గుడ్ ఫ్రైడే. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి, ఏప్రిల్ 22న రంజాన్, ఏప్రిల్ 23న రంజాన్ మర్నాడు సందర్భంగా జనరల్ సెలవులు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

కాగా.. పెద్ద పండుగలైన భోగి, సంక్రాంతి, దీపావళి, రంజాన్ పండుగలు.. రెండో శనివారం, ఆదివారం వచ్చాయి. న్యూఇయర్ ఆదివారం రోజు రాగా.. భోగి పండుగ రెండో శనివారం రోజు వచ్చింది. సంక్రాంతి పండుగ కూడా ఆదివారం రోజే వచ్చింది. దీపావళి పర్వదినం సైతం ఆదివారం రోజే వచ్చింది. తెలంగాణలో అత్యంత ఘనంగా జరుపుకునే సద్దుల బతుకమ్మ పండగా అక్టోబర్ 10న వచ్చింది. విజయవదశమి సందర్భంగా అదే నెల 24న ప్రభుత్వం సెలవును ప్రకటించింది. దీపావళి సెలవును నవంబర్ 12న ప్రకటించింది ప్రభుత్వం.

మొత్తం 24 రోజుల ఆప్షనల్ హాలిడేస్ లో కనుమ, మహవీర్ జయంతి, బసవ జయంతి, వరలక్ష్మి వ్రతం, దుర్గాష్టమి, నరకచతుర్ధి తదితర పండుగలు ఉన్నాయి.

సాధారణ సెలవులు..

జనవరి 1 – నూతన సంవత్సరం
జనవరి 14 – భోగి
జనవరి 15 – సంక్రాంతి
జనవరి 26 – గణతంత్ర దినోత్సవం
ఫిబ్రవరి 18 – మహాశివరాత్రి
మార్చి 7 – హోళీ
మార్చి 22 – ఉగాది
మార్చి 30 – శ్రీరామనవమి
ఏప్రిల్ 5 – బాబు జగజ్జీవన్ రామ్ జయంతి
ఏప్రిల్ 7 – గుడ్ ఫ్రైడే
ఏప్రిల్ 14 – అంబేడ్కర్‌ జయంతి
ఏప్రిల్ 22 – రంజాన్‌
ఏప్రిల్ 23 – రంజాన్ తదుపరి రోజు
జూన్ 29 – బక్రీద్
జులై 17 – బోనాలు
జులై 29 – మొహర్రం
ఆగస్టు 15 – స్వాతంత్య్ర దినోత్సవం
సెప్టెంబరు 7 – కృష్ణాస్టమి
సెప్టెంబరు 18 – వినాయక చవితి
సెప్టెంబరు 28 మిలాద్‌-ఉన్‌-నబి
అక్టోబర్ 2 – గాంధీ జయంతి
అక్టోబర్ 14 – బతుకమ్మ ప్రారంభం
అక్టోబరు 24 – విజయదశమి
అక్టోబరు 25 – విజయదశమి తర్వాతి రోజు
నవంబర్ 12- దీపావళి
నవంబర్ 27- కార్తీక పూర్ణిమ/ గురునానక్ జయంతి
డిసెంబరు 25 – క్రిస్మస్
డిసెంబర్ 26 – బాక్సింగ్ డే

 

ఆప్షనల్ సెలవులు..

సాధారణ సెలవులు, ఐచ్ఛిక సెలవులు ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తాయి. ఇక 28 సాధారణ సెలవుల్లో.. 4 హాలీడేస్ ఆదివారాల్లో వచ్చాయి. 2 సెలవులు రెండో శనివారాల్లో వచ్చాయి. దీంతో ప్రభుత్వ ఉద్యోగులకు వాస్తవంగా లభించనున్న సాధారణ సెలవుల సంఖ్య 22కి తగ్గనుంది. ఇక మతం, ఉత్సవంతో సంబంధం లేకుండా 24 ఆప్షనల్ హాలీడేస్ లో గరిష్టంగా ఏవైనా 5 ఐచ్ఛిక సెలవులను వాడుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నెలవంక ఆధారంగా రంజాన్, బక్రీద్, మొహర్రం, మిలాద్‌-ఉన్-నబీ పర్వదినాల సెలవుల్లో ఏమైనా మార్పులుంటే తర్వాత ప్రకటిస్తారు.

వేతనంతో కూడిన సెలవులు..

ట్రెండింగ్ వార్తలు