Gun Misfires in kautala PS : గన్ మిస్ ఫైర్ .. నోట్లోంచి తలలోకి దూసుకెళ్లిన బుల్లెట్, కానిస్టేబుల్ మృతి

కొమరంభీమ్ జిల్లా కౌటాల పోలీస్‌స్టేష‌న్‌లో గ‌న్ మిస్ ఫైర్ అయింది. ఈ ఘటనలో బులెట్ టీఎస్ ఎస్పీ కానిస్టేబుల్ రజనీకుమార్ నోట్లోంటి తలలోకి దూసుకెళ్ళింది. దీంతో అతని తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. రక్తపు మడుగులో ఉన్న రజనీకుమార్ ను హుటాహుటినా స్టేషన్ సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. ప్ర‌స్తుతం అత‌ని ప‌రిస్థితి ఆందోళ‌న‌కరంగా ఉంది.

gun misfires in kautala police station constables condition Very critical

Gun Misfires in kautala PS : కొమరంభీమ్ జిల్లా కౌటాల పోలీస్‌స్టేష‌న్‌లో గ‌న్ మిస్ ఫైర్ అయింది. ఈ ఘటనలో బులెట్ టీఎస్ ఎస్పీ కానిస్టేబుల్ రజనీకుమార్ నోట్లోంటి తలలోకి దూసుకెళ్ళింది. దీంతో అతని తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. రక్తపు మడుగులో ఉన్న రజనీకుమార్ ను హుటాహుటినా స్టేషన్ సిబ్బంది ఆస్పత్రికి తరలించారు.  ప‌రిస్థితి ఆందోళ‌న‌కరంగా మారటంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతు కానిస్టేబుల్ రజనీకుమార్ మృతి చెందారు.

కాగా గన్ మిస్ ఫైర్ అయ్యిందా? లేక రజనీకుమార్ ఆత్మహత్యకు యత్నించాడా? అనే విషయంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై విచార‌ణ చేపట్టారు.  దీనిపై సమచారం అందుకున్న జిల్లా ఎస్పీ సురేష్‌కుమార్  చికిత్స పొందుతున్న ఆస్ప‌త్రికి చేరుకొని అత‌ని ఆరోగ్య ప‌రిస్థితిపై ఆరా తీశారు.  కానీ కానిస్టేబుల్ రజనీకుమార్ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని తెలుసుకున్నారు. ఆ తరువాత కొద్దిసేపటికే రజనీకుమార్  ప్రాణాలు విడిచారు. ఈ ఘ‌ట‌న ఎలా జ‌రిగింద‌నే విష‌యంపై సిబ్బందిని అడిగి వివ‌రాలు తెలుసుకుంటున్నారు. కాగా రజనీకుమార్ 2022 మే నుంచి కౌటాల పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నారు.