Telangana Junior Doctors Going Strike (2)
telangana junior doctors going strike : రాష్ర్ట వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో జూనియర్ డాక్టర్లు చేపట్టిన విషయం తెలిసిందే. దీనిపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ కరోనా సమయంలో ప్రజల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని..ఇటువంటి సయమంలో డాక్టర్లు సమ్మె చేయటం తగదని రోగుల ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని సమ్మె విరమించాలని సూచించారు. జూనియర్ డాక్టర్లు తక్షణమే సమ్మె విరమించి డ్యూటీలో చేరాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. సమ్మె విరమించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. జూడాల సమ్మెకు ఇది సరైన సమయం కాదు.. వారి సమస్యలన్నింటినీ ప్రభుత్వం పరిశీలిస్తోందని కేటీఆర్ స్పష్టం చేశారు.
కాగా పెంచిన స్టైఫండ్‌ను వెంటనే అమలు చేయాలని కోరుతూ జూనియర్ డాక్టర్లు సమ్మెబాట పట్టిన విషయం తెలిసిందే. సుదీర్ఘకాలంలో పెండింగ్ లో ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎమర్జన్సీ సేవలు మినహా అన్ని సేవలు బంద్ చేస్తున్నామని ప్రకటించిన జూనియర్ డాక్టర్లు సమ్మె బాట పట్టారు. కాగా డిమాండ్ల సాధనలో భాగంగా మే 10న జూనియర్ డాక్టర్ల సంఘం ప్రతినిథులు రాష్ట్ర వైద్య విద్యా సంచాలకులు రమేష్ రెడ్డికి సమ్మె నోటీసులు అందజేశారు. 15 రోజుల్లో తమ డిమాండ్లు పరిష్కరించకపోతే సమ్మె బాట పడతామని తెలియజేశారు. అయినా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందనా లేకపోవటం తప్పనిసరి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు సమ్మె చేపట్టారు.
గత కొన్ని రోజుల క్రితం సీఎం కేసీఆర్ గాంధీ హాస్పిటల్ ను సందర్శించిన సందర్భంగా హామీ ఇచ్చారని..కానీ ఇప్పటి వరకూ తమ సమస్యల దిశగా ఎటువంటి పరిష్కారం తీసుకుంటున్నట్లుగా లేదనీ దీంతో సమ్మె చేపట్టాల్సి వచ్చిందని జూనియర్ డాక్టర్లు తెలిపారు. సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన 15శాతం వేతన పెంపును వెంటనే అమల చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే ఈ నెల 28 నుంచి అన్ని సేవల్ని బంద్ చేస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 6వేలమంది జూనియర్ డాక్టర్లు ఉన్నారు. మరో వెయ్యి మంది వరకు సీనియర్ రెసిడెంట్లు ఉన్నారు. కరోనా వైరస్ వ్యాపిస్తున్న వేళ డాక్టర్లు చేస్తున్న సేవలు అత్యంత కీలకంగా ఉన్న సమయంలో డాక్టర్లు సమ్మెకు దిగిన క్రమంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టింది. కరోనా రోగులకు చికిత్సకు ెటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలని ఉన్నతాధికారులకు సూచించింది.
కరోనా వైరస్ వ్యాపిస్తున్న వేళ డాక్టర్లు చేస్తున్న సేవలు అత్యంత కీలకం. వైరస్ విలయతాండవం చేస్తున్న వేళ.. సమ్మె చేపట్టటం కాస్త సీరియస్ అంశమే. ఈక్రమంలో డాక్టర్ల సమ్మె డిమాండ్లలో 15శాతం వేతన పెంపుతో పాటు..హెల్త్ కేర్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చికిత్సలు పొందేందుకు పడకల సంఖ్య పెంచాలని.. చనిపోయిన డాక్టర్లకు రూ.50 లక్షలు, నర్సులకు రూ.25 లక్షలుగా ప్రకటించిన ఎక్స్‌గ్రేషియాను అమలు పరచాలని కోరారు. ప్రభుత్వం ప్రకటించిన 10శాతం ఇన్సెంటీవ్‌ను వెంటనే అమలు పరచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రకటించిన 10శాతం ఇన్సెంటీవ్‌ను వెంటనే అమలు పరచాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే సమ్మె చేపడుతామని హెచ్చరించిన క్రమంలో ఈ కరోనా సమయంలో తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మె చేపట్టామని తెలిపారు జూనియర్ డాక్టర్లు.