Telangana : అసెంబ్లీ, మండలి సమావేశాలు ప్రారంభం.. సోమవారానికి వాయిదా
కరోనా రూల్స్ పాటిస్తూ.. సమావేశాలు నిర్వహిస్తామని.. సభ్యులు నియమ నిబంధనలు పాటించాలని స్పీకర్ పోచారం సూచించారు.
- Paramesh V
- Published On : September 24, 2021 / 11:30 AM IST
Ts Assembly 2
Telangana Assembly : తెలంగాణ శాసన సభ, శాసన మండలి వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో.. ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సెషన్ మొదలైంది. ఇటీవల కాలంలో మృతిచెందిన మాజీ శాసన సభ్యులు, ప్రజా ప్రతినిధులకు అసెంబ్లీ సంతాపం తెలిపింది. స్పీకర్ సంతాపం తీర్మానం తర్వాత… శాసన సభ సభ్యులు 2 నిమిషాలు మౌనం పాటించారు. అసెంబ్లీకి సీఎం కేసీఆర్ సహా ప్రతిపక్ష నేతలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
Ts Assembly
భద్రాచలం మాజీ శాసన సభ్యుడు కుంజా బొజ్జి, ములుగు మాజీ ఎమ్మెల్యే అజ్మీరా చందూలాల్, హుజురాబాద్ మాజీ MLA కేతిరి సాయిరెడ్డి, బూర్గంపాడు ఎక్స్ MLA కుంజా భిక్షం, కరంనగర్ మాజీ ఎమ్మెల్యే ఎం.సత్యనారాయణ రావు, వర్దన్నపేట మాజీ ఎమ్మెల్యే మాచర్ల జగన్నాథం, రామాయం పేట మాజీ శాసన సభ్యుడు ముత్యంరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొగ్గారపు సీతారామయ్య, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే చేకూరి కాశయ్యకు తెలంగాణ అసెంబ్లీ సంతాపం తెలిపింది.
Telangana Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
కరోనా రూల్స్ పాటిస్తూ.. సమావేశాలు నిర్వహిస్తామని.. సభ్యులు నియమ నిబంధనలు పాటించాలని స్పీకర్ పోచారం సూచించారు. సంతాప తీర్మానం తర్వాత… అసెంబ్లీని సోమవారానికి వాయిదా వేశారు స్పీకర్. సోమవారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ యథావిధిగా సమావేశం అవుతుందని స్పీకర్ ఓ ప్రకటనలో తెలిపారు. శాసన మండలి కూడా సోమవారం ఉదయానికి వాయిదాపడింది.
