Telangana Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాలకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈరోజు (శుక్రవారం) ఉదయం 11 గంటలకు శాసనసభ, శాసనమండలి వేర్వేరుగా సమావేశమవుతాయి.

Telangana Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

Telangana Assembly

Telangana Assembly: తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాలకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈరోజు (శుక్రవారం) ఉదయం 11 గంటలకు శాసనసభ, శాసనమండలి వేర్వేరుగా సమావేశమవుతాయి. ఇటీవల మరణించిన మాజీ సభ్యులకు తొలుత సంతాపాలు ప్రకటించి తర్వాత ఇరు సభలు వాయిదా పడనున్నాయి. అనంతరం అసెంబ్లీ స్పీకర్, మండలి ప్రొటెం ఛైర్మన్‌ అధ్యక్షతన బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ (BAC) భేటీలు జరుగుతాయి. అందులో సభల నిర్వహణ, సమావేశ తేదీలు, ఎజెండాలను ఖరారు చేస్తారు.

Brahmamgari Matam: 2 నెలల్లో పీఠాధిపతి నియామకం పూర్తి చేయాల్సిందే!

ఆ తర్వాత 25, 26 తేదీల్లో సమావేశాలకు విరామం ప్రకటించి.. తిరిగి 27వ తేదీ నుంచి వచ్చే నెల ఒకటో తేదీ వరకు సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు ప్రాధమిక సమాచారం. వారం లేదా 10 రోజుల పాటు జరగనున్న ఈ శాసనసభ సమావేశాలకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు గత వారమే ప్రకటించింది. నేటి నుంచి శాసనసభ, శాసనమండలి సమావేశాలు జరగనున్న నేపథ్యంలో అసెంబ్లీలోని కమిటీహల్‌లో అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిల్ ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్ రెడ్డి అధ్యక్షతన గురువారం ఉన్నతాధికారుల సమీక్ష సమావేశం జరిగింది.

Big Boss 5: ప్రేమ కథలు, బ్రేకప్ స్టోరీలు.. ఎమోషనల్‌గా మారిన ఎపిసోడ్

నేటి అసెంబ్లీ సెషన్ లో ముందుగా మాజీ సభ్యుల మృతికి సంతాపాలు ప్రకటించిన అనంతరం మంత్రులు పలు ఆర్డినెన్సులు, నివేదికలను సమర్పించే అవకాశం కూడా ఉంది. రాష్ట్ర హౌజింగ్‌ బోర్డు సవరణ ఆర్డినెన్స్‌ను మంత్రి ప్రశాంత్‌రెడ్డి.. కొండాలక్ష్మణ్‌ బాపూజీ ఉద్యాన వర్సిటీ సవరణ ఆర్డినెన్స్‌ను నిరంజన్‌రెడ్డి సభ ముందు పెడతారు. ఇక రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ మూడో వార్షిక నివేదికను మంత్రి తలసాని, ట్రాన్స్‌కో, డిస్కమ్‌లు, పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్ల వార్షిక నివేదికను జగదీశ్‌రెడ్డి.. టూరిజం అభివృద్ధి సంస్థ వార్షిక నివేదకను శ్రీనివాస గౌడ్, తెలంగాణ సమగ్ర శిక్ష అభియాన్‌ ఆడిట్‌ నివేదికను సబితా ఇంద్రారెడ్డి సభకు సమర్పిస్తారు.