Police Recruitment
Police Recruitment: తెలంగాణలో పోలీసు ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. రేపటితో దరఖాస్తుల ప్రక్రియ ముగుస్తుంది. అయితే, పోలీస్ రిక్రూట్‌మెంట్ వెబ్‌సైట్ పనిచేయడం లేదని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. దరఖాస్తు చేసుకుందామని ప్రయత్నిస్తుంటే, వెబ్‌సైట్ సరిగ్గా పనిచేయడం లేదంటున్నారు.
Telangana : గులాబీకి షాక్..కాంగ్రెస్ లో చేరుతున్న టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు..!
దరఖాస్తులకు రేపే చివరి రోజు కావడంతో అభ్యర్థులు, ఎక్కువ సంఖ్యలో అప్లై చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో వెబ్‌సైట్ సరిగ్గా పనిచేయడం లేదు. దీంతో దరఖాస్తుల ప్రక్రియకు అంతరాయం ఏర్పడింది. పోలీసు ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, వెబ్‌సైట్ త్వరగా పనిచేసేలా చూడాలని అభ్యర్థులు కోరుతున్నారు. ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ఈ నెల 2 నుంచి దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. మొత్తం 16 వేల 614 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. దీనికి భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి.
Modi Telangana Tour : రాజకీయ ఆసక్తి రేపుతున్న ప్రధాని మోదీ తెలంగాణ టూర్
ఇప్పటివరకు దాదాపు ఎనిమిది లక్షల వరకు దరఖాస్తులు రాగా, నాలుగు లక్షలకుపైగా అభ్యర్థులు అప్లై చేశారు. ఆగష్టు 7న ఎస్సై, 21న కానిస్టేబుల్స్ రాత పరీక్ష జరుగుతుంది. అభ్యర్థుల సమస్యలపై దాదాపు 12 వేల వరకు హెల్ప్‌లైన్ నెంబర్‌కు కాల్స్ వచ్చాయి. సెప్టెంబర్ మొదటి వారంలో ఫలితాలు విడుదలవుతాయి.