TS Covid Update : తెలంగాణ కొత్తగా 482 కోవిడ్ కేసులు
తెలంగాణలో ఈరోజు కొత్తగా 482 కొవిడ్ కేసులు నమోదయ్యాయి.
- chvmurthy
- Published On : January 3, 2022 / 09:06 PM IST
Telangana Covid Cases
TS Covid Update : తెలంగాణలో ఈరోజు కొత్తగా 482 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 212 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో కొవిడ్ రికవరీ రేటు 98.81 శాతంగా ఉందని రాష్ట్ర ప్రజారోగ్యశాఖ ఈరోజు విడుదల చేసిన తాజా బులెటిన్ పేర్కొంది.
దీంతో రాష్ట్రంలో ఇంతవరకు 6,82,971 మందికి పైగా కొవిడ్ సోకగా, వారిలో 6,74, 892 మంది పైగా కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,228 క్రియాశీల కేసులు ఉన్నాయి.
Also Read : Biometric Attendance : ఒమిక్రాన్ ఎఫెక్ట్.. ఉద్యోగులకు బయోమెట్రిక్ అటెండెన్స్ రద్దు… కేంద్రం కీలక నిర్ణయం
కోవిడ్ వల్ల ఈరోజు ఒకరు మరణించటంతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 4,031 కి చేరింది. ఈరోజు జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 294 కోవిడ్ కేసులు… రంగా రెడ్డి జిల్లాలో 55, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 48 కేసులు నమోదయ్యాయి.
TS Covid report
