భారత్ – చైనా సరిహద్దులో సోమవారం రాత్రి చైనా సైన్యంతో జరిగిన ఘర్షణలో తెలంగాణ బిడ్డ, సూర్యాపేట నివాసి కల్నల్ బిక్కుమళ్ల సంతోష్ (37) వీరమరణం పొందారు. కన్నుమూసిన 20 మంంది జవాన్లలో సంతోష్ కూడా ఒకరు. ఆదివారం రాత్రే తల్లికి ఫోన్ చేసి అమ్మా బాగున్నావా..అంటూ పలకరించిన 24 గంటలు కాకముందే…వీరమరణం పొందడం అందర్నీ కలిచివేసింది.
1983లో జననం : –
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌కు బిక్కుమళ్ల ఉపేందర్, మంజుల దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి కుమారుడు సంతోష్, కుమార్తె శృతి ఉన్నారు. 1983 ఫిబ్రవరిలో జన్మించిన సంతోష్ జన్మించారు. ఉపేందర్ ఎస్‌బీఐ బ్యాంకులో వివిధ హోదాల్లో పనిచేశారు. చీఫ్ మేనేజర్‌గా రిటైరయ్యారు. కానీ..సైన్యంలో చేరి భారతదేశానికి సేవ చేయాలనే తపన ఉపేందర్ కు ఉండేది. కానీ అది నెరవేరలేదు.
తండ్రి కలను నెరవేర్చేందుకు : –
తన కొడుకు రూపంలో చాడాలని అనుకున్నారు. తండ్రి కలను నెరవేర్చేందుకు సంతోష్ చిన్ననాటి నుంచే విపరీతంగా శ్రమించాడు. 1 నుంచి 5వ తరగతి వరకు స్థానిక సంధ్య హైస్కూల్‌లో చదివారు. 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఏపీలోని విజయనగరంలో ఉన్న కోరుకొండ సైనిక్ స్కూల్ విద్యనభ్యసించారు. తర్వాత..పూణేకు మకాం మార్చారు. అక్కడున్న నేషనల్ డిఫెన్స్ అకాడమీలో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత డెహ్రాడూన్‌లో సైనిక శిక్షణ చేపట్టారు. 2004 డిసెంబర్‌లో లెఫ్ట్‌నెంట్‌గా బిహార్ రెజిమెంట్ 16వ బెటాలియన్‌లో విధుల్లో చేరారు సంతోష్.
15 ఏళ్ల సర్వీసులో : –
ఎన్నో కష్టాలు పడి..శ్రమించి..తన తండ్రి కలను నెరవేర్చారు. దీంతో ఆ తండ్రి ఎంతో సంతోషించారు. ఎన్నో గోల్డ్ మెడల్స్‌ను సొంతం చేసుకున్నారు సంతోష్. తన 15 ఏళ్ల సర్వీసులో నాలుగు పదోన్నతులు పొందడం విశేషం. 2007లో ముగ్గురు చొరబాటుదారులను అంతమొందించారు. ఢిల్లీ, కశ్మీర్, అరుణాచల్‌ప్రదేశ్, మేఘాలయా, లడక్, పాకిస్తాన్‌తోగల సరిహద్దులో కూడా పనిచేశారు. కొంతకాలం ఆఫ్రికా దేశం కాంగోలోనూ విధులు నిర్వహించారు సంతోష్. ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌లోని లడక్‌లో (కల్నల్) కమాండర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
వీరమరణం : –
భారతదేశంలో కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో సంతోష్…లడక్‌లోనే విధులు నిర్వహించాల్సి వచ్చిందని కుటుంబ సభ్యులు తెలిపారు. చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో సంతోష్ వీరమరణం పొందడంతో తల్లిదండ్రులు కలత చెందారు. ఈ విషాద వార్త..మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు సైనికాధికారులు ఫోన్ ద్వారా తెలిపారు.
Read: కల్నల్ సంతోష్ త్యాగం వెలకట్టలేనిది…అతని కుటుంబానికి ప్రభుత్వం ఉండగా ఉంటుంది : సీఎం కేసీఆర్