Rains In Telangana: తెలంగాణలో మోస్తరు వర్షాలు
సోమ, మంగళవారాల్లో తెలంగాణలో అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలంగాణ వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఆదివారం ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. పలు చోట్లు 3-4 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
- Narender Thiru
- Published On : June 27, 2022 / 08:00 AM IST
Rains In Telangana
Rains In Telangana: సోమ, మంగళవారాల్లో తెలంగాణలో అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలంగాణ వాతావరణ శాఖ వెల్లడించింది. మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్‌ఘడ్, ఒడిశాల మీదుగా బంగాళాఖాతం వరకు 1,500 మీటర్ల ఎత్తులో గాలులతో ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. ఒడిశాపై మాత్రం గాలులతో కూడిన ఉపరితల ఆవర్తన ద్రోణి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. ఈ ఉపరితల ద్రోణి ప్రభావంతో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రస్తుతం తెలంగాణలో రుతుపవనాల కదలికలు సాధారణంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
Intermediate Results: రేపే తెలంగాణ ఇంటర్ ఫలితాలు
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఆదివారం ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. పలు చోట్లు 3-4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా, 3-4 డిగ్రీలు తక్కువగా ఉన్నాయి. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 35.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
