×
Ad

Thaman Mother Singing : 70 ఏళ్ళ వయసులో మసక మసక చీకట్లో పాడుతున్న తమన్ తల్లి సావిత్రి..

ఆదివారం నాడు తన తల్లి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించగా అందులో తమన్ తల్లి మసక మసక చీకట్లో సాంగ్ పాడింది. ఆ సాంగ్ ని రికార్డ్ చేసి తమన్ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..................

  • Published On : August 8, 2022 / 11:56 AM IST

Thaman mother singing

Thaman Mother Singing :  ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు మ్యూజిక్ డైరెక్టర్ తమన్. ఇటీవలే నేషనల్ అవార్డు రావడంతో మరింత జోష్ లో ఉన్నాడు. తాజాగా ఆదివారం తమన్ తల్లి సావిత్రి పుట్టిన రోజు కావడంతో స్పెషల్ బర్త్ డే విషెష్ ని పోస్ట్ చేశాడు ట్విట్టర్ లో. అంతేకాక తన తల్లి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించాడు. ఈ వేడుకల్లో తమన్ తల్లి పాట పాడటం విశేషం.

తమన్ తన తల్లి సావిత్రితో కలిసి ఉన్న ఫోటోని ట్విట్టర్ లో షేర్ చేసి.. ”ఈ రోజు అమ్మగారికి 70 ఏళ్లు నిండాయి. బాల్యంలో 21 ఏళ్లు, భర్తతో 14 ఏళ్లు, నా కోసం, నా కెరీర్ కోసం దాదాపు 35 ఏళ్లు త్యాగం చేశారు. నీ కోసం నేను ఇంకా కష్టపడతాను అమ్మా. నీ కోసం నేను ఇంకా సూపర్ బెస్ట్ అయ్యేందుకు ప్రయత్నిస్తాను. నాకు ఈ జీవితాన్ని ఇచ్చినందుకు థాంక్స్ అమ్మా” అంటూ పోస్ట్ చేశాడు.

Mahesh Babu Pokiri Re-Release : పోకిరి వరల్డ్ వైడ్ రీ రిలీజ్.. 16 ఏళ్ళైనా తగ్గని క్రేజ్.. టికెట్లు మొత్తం సేల్..

అలాగే ఆదివారం నాడు తన తల్లి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించగా అందులో తమన్ తల్లి మసక మసక చీకట్లో సాంగ్ పాడింది. ఆ సాంగ్ ని రికార్డ్ చేసి తమన్ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ”మా అమ్మ ఈ రోజు మంచి ఫాంలో ఉంది. ఆవిడ తన స్టైల్లో మసక మసక చీకట్లో అనే సాంగ్‌ను అద్భుతంగా పాడేస్తుంది. డ్రమ్స్‌తో శివమణి చితక్కొట్టేశాడు. ఇంకా ఇలాంటి పుట్టిన రోజులెన్నో జరుపుకోవాలి అమ్మా” అంటూ పోస్ట్ చేశాడు. దీంతో 70 ఏళ్ళ వయసులో ఆ ఎనర్జీతో పాట పాడుతుండటంతో వీడియో వైరల్ గా మారింది. నెటిజన్లు తమన్ తల్లిని అభినందిస్తున్నారు.