Ketaki Chitale: 40 రోజులుగా జైల్లోనే నటి.. బెయిల్ మంజూరు

దాదాపు నలభై రోజులుగా జైల్లో శిక్ష అనుభవిస్తున్న కేతకి జైలు నుంచి విడుదల కానుంది. కేతకి గత నెలలో శరద్ పవార్‌ గురించి ఫేస్‌బుక్‌లో కొన్ని పోస్టులు చేసింది. దీంతో ఆమెపై థానే, పింప్రి, పుణేల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశాయి.

Ketaki Chitale: ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టు చేసిందనే కారణంతో అరెస్టైన మరాఠీ యువ నటి కేతకి చిటాలేకు తాజాగా బెయిల్ లభించింది. దాదాపు నలభై రోజులుగా జైల్లో శిక్ష అనుభవిస్తున్న కేతకి జైలు నుంచి విడుదల కానుంది. కేతకి గత నెలలో శరద్ పవార్‌ గురించి ఫేస్‌బుక్‌లో కొన్ని పోస్టులు చేసింది. మరాఠీ కవితను ఉదహరిస్తూ రాసిన ఆ పోస్టులో ‘నరకం ఎదురు చూస్తోంది’, ‘మీకు బ్రాహ్మణులంటే ద్వేషం’ అనే అర్థం వచ్చే కొన్ని పదాలు వాడింది. దీంతో ఆమెపై థానే, పింప్రి, పుణేల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశాయి.

TTD: ఆగష్టు 7న జిల్లా కేంద్రాల్లో టీటీడీ కల్యాణమస్తు

ఐపీసీ సెక్షన్ 500, సెక్షన్ 501, సెక్షన్ 153ఏ కింద ఆమెపై కేసులు నమోదయ్యాయి. దీంతో థానే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేతకిని అరెస్టు చేశారు. అలాగే ఆమెను నవీ ముంబై పోలీసులు తీసుకెళ్తున్న సమయంలో కొందరు ఎన్సీపీ కార్యకర్తలు ఆమెపై దాడికి పాల్పడ్డారు. కాగా, దాదాపు నలభై రోజులుగా కేతకి థానే జైల్లోనే ఉంది. తాజాగా థానె కోర్టు నటికి బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆమె గురువారం జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.

ట్రెండింగ్ వార్తలు