పబ్జీ గేమ్ ఆడొద్దని తల్లిదండ్రులు మందలించడంతో ఉరివేసుకుని బాలుడు ఆత్మహత్య

  • Publish Date - December 10, 2020 / 08:43 PM IST

boy committed suicide by hanging : వికారాబాద్‌ జిల్లాలో పబ్జీ గేమ్‌కు మరో బాలుడు బలైయ్యాడు. పబ్జీ ఆడొద్దని బాలుడిని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపంతో బాలుడు ఇంట్లో ఉరేసుకున్నాడు. ఈ ఘటన వికారాబాద్‌ జిల్లా కుల్కచర్ల మండలం బండవెల్కిచర్లలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.



గతంలో మొబైల్ విషయంలో బాలుడిని మందలించినప్పుడు ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయిన సందర్భాలున్నాయని తల్లిదండ్రులు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాలుడి ఆత్మహత్యకు వేరే కారణాలేమైనా ఉన్నాయా అన్న కోణంలో విచారణ చేపట్టారు.



15 సంవత్సరాల వయసున్న ముక్తానంద మొబైల్ ఎక్కువగా వాడటం, అది కూడా కేవలం పబ్జీ గేమ్ కోసం ఉపయోగించడంతో తల్లిదండ్రులు పలుమార్లు మందలించారు. అయితే రాత్రికి సంబంధించి నిద్రపోకుండా పబ్జీ గేమ్ ఆడుతుడంతో తల్లిదండ్రులు గట్టిగా మందలించడంతో బాలుడు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.



ముక్తానంద స్నేహితులను కూడా పోలీసులు విచారించారు. వీరంతా పబ్జీ గేమ్ బ్యాన్ అయినప్పటికీ ఓల్డ్ వర్షన్ లో ఇన్ స్టాల్ చేసుకున్నవి రన్ అవుతున్నట్లు గుర్తించారు.

ట్రెండింగ్ వార్తలు