Viral Video : పెళ్ళివేడుకల్లో ఫోటోలు తీస్తూ స్విమ్మింగ్ ఫూల్ లో పడ్డ కెమెరామన్…వీడియో వైరల్

నార్త్ కాలిఫోర్నియాకు చెందిన ప్రముఖ అపెరీనా స్టూడియోస్ తన ఇన్ స్టా ఖాతాలో ఈ వీడియోను షేర్ చేసింది. అందులోని దృశ్యాలు చూస్తుంటే ఓ భారతీయ కుటుంబానికి చెందిన పెళ్ళివేడుకలగా కనిపిస్తోంది.

Wedding

Viral Video : పెళ్ళంటే ఆ హడాహుడే వేరు. ఎందుకంటే పెళ్ళివేడుక జన్మలో ఒకసారి మాత్రమే జరుగుతుంది. అలాంటి వేడుకకు సంబంధించిన తీపిగుర్తులను పదిలపరుచుకోవాలని చాలా మంది కోరుకుంటారు. పెళ్ళికి సంబంధించిన ప్రతి అంశాన్ని గుర్తిండిపోయేలా ఫోటోలు, వీడియోల రూపంలో నిక్షిప్తం చేసుకుని జాగ్రత్తగా పదిలపరుచుకుంటారు.

పెళ్ళి వేడుకలో ఫోటో గ్రాఫర్ల గురించి చెప్పాల్సిన పనిలేదు. పెళ్ళి వారికంటే వీళ్ళుచేసే హడాహుడి మామూలుగా ఉండదనుకోండి. వివిధ రకాల భంగిమల్లో ఫోటోలు తీస్తూ ఉంటారు. ఇక ఆసమయంలో వారు పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. తాజాగా ఓ ఫోటో గ్రాఫర్ పెళ్ళి వేడుక సందర్భంలో ఫోటోలు తీస్తూ స్విమ్మింగ్ ఫూల్ లో పడ్డ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

నార్త్ కాలిఫోర్నియాకు చెందిన ప్రముఖ అపెరీనా స్టూడియోస్ తన ఇన్ స్టా ఖాతాలో ఈ వీడియోను షేర్ చేసింది. అందులోని దృశ్యాలు చూస్తుంటే ఓ భారతీయ కుటుంబానికి చెందిన పెళ్ళివేడుకలగా కనిపిస్తోంది. అందులో పెళ్ళి కుమారుడు, పెళ్ళి కుమార్తె సాంప్రదాయ దుస్తులు ధరించి విల్లా నుండి బయటకు నడుచుకుంటూ స్విమ్మింగ్ ఫూల్ వద్దకు వస్తున్నారు.

స్విమ్మింగ్ ఫూల్ వద్దకు వస్తున్న ఈ జంటను తన కెమెరాలో బంధించేందుకు ఓ ఫోటో గ్రాఫర్ తన కెమెరాను క్లిక్ మనిపించే సమయంలో  తన కాలును వెనక్కు సవరించబోగా ఒక్కసారిగా  వెనక ఉన్న స్విమ్మింగ్ ఫూల్ లో పడిపోయాడు. కెమెరా నీటిలో పడిపోకుండా చేతితో పైకి ఎత్తిపట్టుకోగా వెంటనే పక్కనే ఉన్న సెక్యూరిటీ అతని చేతిని పట్టుకుని పైకి లాగాడు. అలా నడుచుకుంటూ బయటకు వస్తున్న వధు,వరులు ఎదురుగా ఈత కొలనులో ఫోటో గ్రాఫర్ పడిన దృశ్యాలను చూసి ఒక్కసారిగా నివ్వెరపోయారు. అయితే దృశ్యాలన్నింటిని ఓ వీడియో గ్రాఫర్ చక్కగా చిత్రీకరించాడు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది. కెమెరా నీటిలో జారిపడిపోకుండా ఫోటో గ్రాఫర్ చాకచక్యం వ్యవహరించటాన్ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. పెళ్ళి వేడుకల్లో ఫోటోలు తీయటమంటే నిజంగానే సాహం చేయల్సిందేనేమో అంటూ కామెంట్లు పెడుతుండగా, మరోవైపు ఫోటో గ్రాఫర్ నీటిలో పడిన సమయంలో వధు వరుల రియాక్షన్ సూపర్ గా ఉందంటూ కామెంట్లు లైకులతో ముంచెత్తుతున్నారు.

https://youtu.be/kt7fIQCcyRo