Kabul
Inside Story of Kabul Airport: కాబూల్ విమానాశ్రయం బయట వేలమంది వేరే దేశాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. అంతేకాదు దాదాపు పది లక్షల మంది దేశం విడిచి వెళ్లాలని అనుకుంటున్నట్లు అంచనా వేస్తున్నారు అధికారులు కానీ ఇప్పటివరకు, 82వేల 300 మందిని మాత్రమే తరలించినట్లుగా అధికారులు చెబుతున్నారు. వీరిలో ఎక్కువ మంది విదేశీ పౌరులు లేదా ఇతర దేశాల వీసా ఉన్నవారే.
అఫ్ఘానిస్తాన్ సాధారణ ప్రజలు మాత్రం ఎయిర్‌పోర్ట్ బయట నరకం లాంటి పరిస్థితితులను అనుభవిస్తున్నారు. ఈరోజు చాలా మంది విమానాశ్రయంలోకి ప్రవేశించడానికి మురికి కాలువ గుండా వెళ్లడానికి ప్రయత్నించారు. విమానాశ్రయం బయట ఈ భాగంలో ఏ వ్యక్తి అయినా 10 నిమిషాలు నిలబడటం కూడా కష్టమే, కానీ చాలా మంది వ్యక్తులు ఎన్నో రోజులుగా అక్కడే నిలబడి ఉంటున్నారు.
నీరు లేక ఆహారం కొనడానికి డబ్బు లేని వారు చాలా మంది కనిపిస్తున్నారు. ఇప్పుడు విమానాశ్రయం వెలుపల లభ్యమయ్యే నీరు, భోజనం చాలా ఖరీదయ్యాయి. చాలా మంది ప్రజలు కొనే స్తోమత కూడా లేనివారు. కాబూల్ విమానాశ్రయం బయట ఒక నీటి బాటిల్ ధర 40 US డాలర్లు అంటే సుమారు 3 వేల రూపాయలు, ఒక ప్లేట్ భోజనం ధర 100 US డాలర్లు అంటే ఏడు వేల రూపాయలకు పైనే చెల్లించాలి. అంతేకాదు.. యుఎస్ కరెన్సీ ఉన్న వ్యక్తులు మాత్రమే ఈ నీరు మరియు ఆహారాన్ని తినగలుగుతున్నారు.