Dog And Ducks
Dog and Ducks Friendship: మన హృదయాలకు హత్తుకునే ఎన్నో జంతువుల స్నేహాలను మనం చూశాం.. ఇంటర్నెట్‌లో ఇలాంటి ఘటనలు వైరల్ గా మారుతుంటాయి. తాజాగా ఓ కుక్క, బాతు పిల్లల స్నేహంచూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే . ఈ వీడియోను ఐఎఫ్‌ఎస్ అధికారి సుశాత్ నంద తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశాడు. ఆయన తన పోస్టుకు శీర్షికను జోడించారు.. ’కరుణ అంటే ఏమిటో అవి మనకు నేర్పుతాయి.. అనాథ బాతు పిల్లల సమూహం లాబ్రాడార్‌లో కొత్త పెంపుడు తండ్రిని కలిగి ఉండటాన్ని మనం చూస్తున్నాం.. వీరి కొత్త బంధం ప్రతిఒక్కరిని ఆకర్షిస్తుంది’.. అంటూ తన ట్వీట్ లో పేర్కొన్నారు.
Viral Video : గుర్రంపై కుక్కపిల్ల స్వారీ
ప్రస్తుతం సమాజంలో ప్రతీఒక్కరూ బిజీ లైఫ్‌లోకి వెళ్లిపోతున్నారు. టెక్నాలజీ రోజురోజుకు పెరుగుతుండటంతో దానికి అనుగుణంగా అధికశాతం మంది మనుషుల్లోనూ మార్పు కనిపిస్తుంది. తద్వారా మనుషుల మధ్య ప్రేమానురాగాలు తగ్గిపోతున్నాయి. బీజీలైఫ్ లో కొంత మంది కుటుంబంలోని వారి ఆలనాపాలనా చూసుకోవటానికి కూడా ఆసక్తి చూపడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరూలేని అనాథలను చేరదీసేవారు చాలా తక్కువగా కనిపిస్తుంటారు.
Gautam Adani: ప్రపంచ కుబేరుల్లో 4వ స్థానంలో గౌతమ్ అదానీ.. ఏడాదిలో రికార్డు స్థాయిలో సంపద వృద్ధి
సుశాంత్ నంద తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేసిన వీడియోలో ఓ కుక్క బాతు పిల్లల సమూహాన్ని దత్తత తీసుకున్నట్లు కనిపిస్తుంది. కుక్కపై బాతు పిల్లలు ఎలాంటి బెరుకు లేకుండా ఆడుకుంటున్నాయి. కుక్క నిద్రిస్తున్న సమయంలో కుక్కపైకి ఎక్కి బాతు పిల్లలు ఆడుకోవటం ఈ వీడియోలో కనిపిస్తుంది. ఈ వీడియోను చూసిన వారంతా కుక్క ప్రేమకు ఫిదా అవుతున్నారు. అరుదుగా కనిపించే ఇలాంటి వీడియోలు ఎప్పుడూ సోషల్ మీడియాను షేక్ చేస్తుంటాయి. తాజాగా సుశాంత్ నంద పోస్టు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో.. ‘మీకు నేనున్నా హాయిగా ఆడుకోండి’ అన్నట్లుగా బాతు పిల్లల పట్ల కుక్క ప్రేమను చూపిస్తున్నట్లుగా ఉంది. ఈ పోస్టు చేసిన కొద్దిగంటల్లోనే వేలాది మంది ఈ వీడియోను చూసి బాతు పిల్లలపై కుక్క చూపించే ప్రేమ పట్ల ఫిదా అవుతున్నారు.
https://twitter.com/susantananda3/status/1549230206518382592?cxt=HHwWgMCq7cSq_P8qAAAA