Viral Video : గుర్రంపై కుక్కపిల్ల స్వారీ

గుర్రాలపై మనుషులే ఎక్కి స్వారీ చేస్తారా... ఏం నేను చేయకూడదా అనుకుందో ఏమో ఒక కుక్కపిల్ల గుర్రం పై ఎక్కి పరుగులు పెట్టింది.

Viral Video : గుర్రంపై కుక్కపిల్ల స్వారీ

Puppy On Horse

Updated On : July 17, 2022 / 7:26 PM IST

Viral Video :  గుర్రాలపై మనుషులే ఎక్కి స్వారీ చేస్తారా… ఏం నేను చేయకూడదా అనుకుందో ఏమో ఒక కుక్కపిల్ల గుర్రం పై ఎక్కి పరుగులు పెట్టింది. ఈ అసాధారణ దృశ్యం మజ్నూభాయ్ సినిమాలలో హీరో అనిల్ కపూర్ గీసిన గుర్ర్రంపై గాడిద పెయింటింగ్ తో పోల్చారు. కొందరు నెటిజన్లు కెనడియన్ టీవీ సిరీస్ ప్రముఖ కార్టూన్ పా పెట్రోల్ ను గుర్తుచేసిందన్నారు.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యోడా4 ఎవర్ అనే ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను అప్ లోడ్ చేశారు. నగర రోడ్లపై పరిగెత్తుతున్న గుర్రంపై కుక్కపిల్ల దర్జాగా నిల్చుని ఉంటుంది. ఆ గుర్రం సిగ్నల్ పడినప్పుడు ఆగిపోతుంది. మళ్లీ గ్రీన్ లైట్ పడగానే ముందుకు పరిగెత్తటం ఈవీడియోలో చూడవచ్చు. ఈవీడియోను ఇప్పటి వరకు 3లక్షలకుపైగా వీక్షకులు చూశారు. 18 వేల మంది లైక్ చేశారు.