Ministers Resignation :12మంది మంత్రుల రాజీనామాలని ఆమోదించిన రాష్ట్రపతి

బుధవారం సాయంత్రం కేంద్ర కేబినెట్ విస్తరణ నేపథ్యంలో కొత్త వారికి చోటు కల్పించే క్రమంలో పలువురు మంత్రులకు ఉద్వాసన పలికిన విషయం తెలిసిందే.

Ministers Resignation బుధవారం సాయంత్రం కేంద్ర కేబినెట్ విస్తరణ నేపథ్యంలో కొత్త వారికి చోటు కల్పించే క్రమంలో పలువురు మంత్రులకు ఉద్వాసన పలికిన విషయం తెలిసిందే. 12మంది కేంద్రమంత్రులు ఇవాళ తమ పదవులుకు రాజీనామా చేయగా..రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ వీరి రాజీనామాలను ఆమోదించారు.

కాగా, మంత్రి పదవికి రాజీనామా చేసిన వారిలో ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జావదేకర్,ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్,విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్,కార్మికశాఖ సహాయ మంత్రి సంతోష్ గంగ్వార్,రసాయనాలు మరియు ఎరువుల శాఖ మంత్రి సదానంద గౌడ,మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రి దేబశ్రీ చౌదరి,విద్యాశాఖ సహాయమంత్రి సంజయ్ షామ్ రావ్ ధోత్రీ,జల్ శక్తి శాఖ సహాయ మంత్రి రతన్ లాల్ కతారియా,కర్ణాటక గవర్నర్ గా నియమితులైన థావర్ చంద్ గెహ్లోత్,బాబుల్ సుప్రియో,ప్రతాప్ చంద్ర సారంగి తమ పదవులకు రాజీనామా చేశారు.

ట్రెండింగ్ వార్తలు