Taj Mahal: ఈనెల 16న తెరుచుకోనున్న తాజ్ మహల్!

కరోనా మహమ్మారి దెబ్బకు దేశంలోని అన్ని పర్యాటక స్థలాలు మూతపడిన సంగతి తెలిసిందే. సెకండ్ వేవ్ తో దేశంలో లక్షల చొప్పున కేసులు నమోదవడంతో తాజ్ మహల్ తో పాటు స్మారక చిహ్నాలు గత రెండు నెలలుగా పర్యాటకులకు అనుమతి లేదు. కాగా, దేశంలో ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టడంతో మళ్ళీ పర్యాటక స్థలాలు తెరుచుకోనున్నాయి.

Taj Mahal: కరోనా మహమ్మారి దెబ్బకు దేశంలోని అన్ని పర్యాటక స్థలాలు మూతపడిన సంగతి తెలిసిందే. సెకండ్ వేవ్ తో దేశంలో లక్షల చొప్పున కేసులు నమోదవడంతో తాజ్ మహల్ తో పాటు స్మారక చిహ్నాలు గత రెండు నెలలుగా పర్యాటకులకు అనుమతి లేదు. కాగా, దేశంలో ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టడంతో మళ్ళీ పర్యాటక స్థలాలు తెరుచుకోనున్నాయి. ప్రేమకు గుర్తుగా భావిస్తూ.. పర్యాటకులను విశేషంగా ఆకట్టుకొనే ప్రేమ సౌధం తాజ్ మహల్ ఈ నెల 16న తెరుచుకోనుంది.

తాజ్‌ మహల్‌తో పాటు పలు స్మారక చిహ్నాలను తిలకించేందుకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నోటిఫికేషన్‌ జారీ చేసింది. తాజ్ మహల్, ఎర్ర కోట, అజంతా గుహలతో సహా అన్ని స్మారక చిహ్నాలు, మ్యూజియంలను ఏప్రిల్ 15న మూసివేయాలని కేంద్రం ఆదేశించగా ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పడుతుండడంతో పర్యాటక రంగంపై ఆధారపడ్డ స్థానికులు తాజ్‌ మహల్‌, ఇతర స్మారక చిహ్నాలను తెరవాలని డిమాండ్‌ చేశారు. దీనిపై పరిశీలించిన అధికారులు, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఈనెల 16న రీఓపెన్ చేసేందుకు అనుమతిచ్చారు.

ట్రెండింగ్ వార్తలు