Incentives Increase : ఆశా వర్కర్లకు గుడ్ న్యూస్.. నెలవారీ ఇన్సెంటివ్స్ 30 శాతం పెంపు

ఆశా వర్కర్లకు ప్రస్తుతం ఉన్న వేతనం 7500 నుంచి 9750 కి పెరుగనుంది. దీంతో రాష్ట్రంలోని 22,533 మంది పబ్లిక్ హెల్త్ వర్కర్లకు లబ్ధి చేకూరనుంది.

Asha workers incentives increased : ఆశా వర్కర్‌ల నెలవారీ ఇన్సెంటివ్‌లను 30 శాతం పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ఎన్ హెచ్ఎం కింద పనిచేస్తున్నఆశ వర్కర్లకు ఇది వర్తిస్తుంది. ప్రస్తుతం ఉన్న 7500 నుంచి 9750 కి పెరుగనుంది. ఈ ఏడాది జూన్ నుంచి పెంచిన ఇన్సెంటివ్‌లు వర్తిస్తాయని సర్కారు పేర్కొంది.

దీంతో రాష్ట్రంలోని 22,533 మంది పబ్లిక్ హెల్త్ వర్కర్లకు లబ్ధి కలగనుంది. ఆశా వర్కర్లకు ప్రస్తుతం వారి పనితీరును బట్టి ఇన్సెంటివ్ రూపంలో గరిష్టంగా రూ.7,500 ఇస్తున్నారు. దానిని రూ.9,750కు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

SSG Security Withdrawal : కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. కశ్మీర్‌లో నలుగురు మాజీ సీఎంలకు ఎస్‌ఎస్‌జీ భద్రత ఉపసంహరణ

ఆశా వర్కర్లకు గతంలో రూ.6000 గౌరవ వేతనం ఉండగా ప్రభుత్వం 2018లో 30 శాతం పెంచింది. దాంతో వేతనం రూ.7,500కు పెరిగింది. తాజా పెంపుతో అది 9,750కు చేరింది. ఇన్సెంటివ్‌ పెంపు పట్ల ఆశ వర్కర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు