Trainman App Offers: రైల్వే ప్రయాణీకులకు గుడ్‌న్యూస్ చెప్పిన ట్రైన్‌మ్యాన్.. రైలు టికెట్ కన్ఫర్మ్ కాకపోతే ఫ్లైట్ టికెట్ ఉచితం ..

రైల్వే ప్రయాణికుల ఇబ్బందులను తొలగించేందుకు ప్రముఖ టికెట్ బుకింగ్ యాప్ ట్రైన్ మ్యాన్ ప్రత్యేక ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. రైలు టికెట్ కన్ఫర్మ్ కాకపోతే మీకు ఫ్లైట్ టికెట్ ఇచ్చేందుకు సిద్ధమైంది.

Trainman App Offers: రైలులో ప్రయాణం చేయాలంటే కన్ఫర్మ్ టిక్కెట్లకు సంబంధించి ఎప్పుడూ సమస్య ఎదురవుతూనే ఉంటుంది. అవసరమైన సమయంలో ఎవరికీ టికెట్ కన్ఫర్మ్ అయ్యే పరిస్థితి లేదు. దీంతో ప్రయాణీకులు నాలుగు నెలల ముందుగానే టిక్కెట్లు బుక్ చేసుకోవాల్సి వస్తోంది. ప్రస్తుతం ఐఆర్సీటీసీ కాకుండా అనేక వెబ్‌సైట్‌లు రైల్వేశాఖ ఆమోదంతో టిక్కెట్‌లను బుక్‌చేస్తున్నాయి. కానీ అక్కడ కూడా మీకు కన్ఫర్మ్ చేసిన రైల్వే టికెట్ వస్తుందనే గ్యారెంటీ లేదు. ఇక వెయిటింగ్ లిస్ట్ ఉంటే పరిస్థితి చెప్పాల్సిన పనిలేదు. టికెట్ కన్ఫర్మ్ అవుతుందో తెలియక, బెర్త్ వస్తుందో లేదోననే టెన్షన్ ప్రయాణికుల్లో ఉంటుంది.

Trine man

రైల్వే ప్రయాణికుల ఇబ్బందులను తొలగించేందుకు ప్రముఖ టికెట్ బుకింగ్ యాప్ ట్రైన్ మ్యాన్ ప్రత్యేక ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. రైలు టికెట్ కన్ఫర్మ్ కాకపోతే మీకు ఫ్లైట్ టికెట్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ట్రైన్‌మ్యాన్ యాప్ ప్రత్యేకత ఏంటంటే… మీరు ఈ యాప్ ద్వారా రైలు టి్కెట్‌ను బుక్ చేసి మీ టికెట్ కన్ఫర్మ్ కాకపోతే, ట్రైన్‌మ్యాన్ మీకు ఫ్లైట్ టికెట్ ఇస్తుంది. ఇందుకోసైం ట్రైన్‌మ్యాన్ ఇటీవల ట్రిప్ అస్యూరెన్స్ అనే ఫీచర్‌ను ప్రారంభించింది. దీని ద్వారా రైల్వే ప్రయాణీకులకు సీట్లు వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉంటే వారికి టికెట్లను కన్ఫామ్ చేసి ఇస్తామని హామీ ఇచ్చింది. ప్రయాణీకుడు కన్ఫామ్ టికెట్లను పొందనట్లయితే, చార్ట్ తయారీకి ముందు టికెట్‌లు కన్ఫామ్ కాకపోతే.. ట్రిప్ అస్యూరెన్స్ ఫీచర్‌ సాయంతో చివరి నిమిషంలో ప్రత్యామ్నాయ ట్రైన్‌ రూట్లు, టికెట్‌ సదుపాయాల్ని గుర్తించి బుక్ చేసుకోవడంలో ఉపయోగపడుతుంది.

Trainman App Offers

మీరు ట్రైన్‌మ్యాన్ ద్వారా రైలు టిక్కెట్‌ను బుక్ చేసుకుంటే నిర్ధారణ అవకాశాలు చూపుతుంది. చార్ట్ తయారీకి ముందు టికెట్లు కన్ఫర్మ్ కాకపోతే ట్రిప్ అస్యూరెన్స్ ప్రయాణీకులకు చివరి నిమిషంలో ప్రత్నామ్నాయ ప్రయాణ ఆప్షన్లను ఎంచుకొని బుక్ చేసుకోవచ్చు. ప్రయాణీకుల టికెట్ ప్రిడిక్షన్ మీటర్ 90శాతం, అంతకంటే ఎక్కువ ఉంటే యాప్ ట్రిప్ అస్యూరెన్స్ రుసుము కేవలం రూ. 1 చెల్లించాల్సి ఉంటుంది. టికెట్ ప్రిడిక్షన్ అవకాశాలు 90శాతంకంటే తక్కువగా ఉంటే మీరు ట్రిప్ అస్యూరెన్స్‌కోసం టికెట్ తరగతిని బట్టి ఛార్జీలు వసూలు చేస్తుంది.

Trainman App Offers Free Flight Tickets

చార్ట్ ప్రిపరేషన్ సమయంలో రైలు టికెట్ కన్ఫామ్ అయినట్లయితే.. ఆ రుసుము కస్టమర్‌లకు రీఫండ్ చేస్తుంది. టికెట్ బుక్‌ కాకపోతే ప్రయాణికులకు ఉచితంగా ఫ్లైట్‌ టికెట్‌ బుక్‌చేస్తామని ట్రైన్‌ మ్యాన్‌ సీఈవో వినీత్ చిరానియా ప్రకటించారు. ట్రిప్ అస్యూరెన్స్ సర్వీస్ ప్రస్తుతం అన్ని ఐఆర్‌సీటీ రాజధాని రైళ్లతో పాటు దాదాపు 130 ట్రైన్లలో సేవలు అందిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు