Aha
Thellavarithe Guruvaram and Chavu Kaburu Challaga: కొత్త కంటెంట్‌తో కూడిన వెబ్ సిరీస్, సూపర్ హిట్ మూవీస్, సరికొత్త టాక్ షోలతో అన్ లిమిటెడ్ ఫన్ అండ్ అదిరిపోయే ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తూ ఆడియెన్స్ అందరిచేత ‘ఆహా’ అనిపించుకుంటూ.. తొలి తెలుగు ఓటీటీగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని, డిజిటల్ రంగంలో దూసుకుపోతోందిం ‘ఆహా’..
‘మగధీర’ కాదిక్కడ.. ‘మర్యాద రామన్న’..
‘Sin’, ‘Locked’, ‘గీతా సుబ్రహ్మణ్యం 2020’ వంటి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ ఒరిజినల్స్‌తో పాటు ‘సామ్ జామ్’, ‘నెం 1 యారి’ లాంటి టాప్ టాక్ షోలతో, లేటెస్ట్‌గా తమన్నా ‘11thHour’, రవితేజ ‘క్రాక్’, నరేష్ ‘నాంది’, ‘జాంబి రెడ్డి’ సినిమాలతో ప్రేక్షకులకు అన్ లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తోంది ‘ఆహా’.. ఇప్పుడు మరో రెండు సూపర్ హిట్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది..
ఫస్ట్ మూవీ ‘మత్తు వదలరా’ తో గుర్తింపు తెచ్చుకున్న శ్రీ సింహా కోడూరి హీరోగా నటించిన రెండో సినిమా ‘తెల్లవారితే గురువారం’.. మణికాంత్ దర్శకత్వంలో వారాహి చలనచిత్రం, లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీని ఏప్రిల్ 16న ఆడియెన్స్ ముందుకు తీసుకొస్తోంది ‘ఆహా’..
బస్తీ బాలరాజుకి చావు ఇంట్లో ప్రేమ పుట్టిందండీ..
కార్తికేయ, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా.. కౌశిక్ పెగళ్లపాటి అనే కొత్త కుర్రాడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. అల్లు అరవింద్ సమర్పణలో, జీఏ2 పిక్చర్స్ బ్యానర్ మీద బన్నీ వాసు నిర్మిస్తున్న చిత్రం ‘చావు కబురు చల్లగా’.. ఈ సినిమా ఏప్రిల్ 23 నుండి ‘ఆహా’లో స్ట్రీమింగ్ కానుంది.