‘మగధీర’ కాదిక్కడ.. ‘మర్యాద రామన్న’..

‘మగధీర’ కాదిక్కడ.. ‘మర్యాద రామన్న’..

Updated On : March 10, 2021 / 3:44 PM IST

Thellavarithe Guruvaram: తొలి చిత్రం ‘మత్తు వదలరా’ తో గుర్తింపు తెచ్చుకున్న శ్రీ సింహా కోడూరి నటిస్తున్న కొత్త సినిమా ‘తెల్లవారితే గురువారం’.. ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మణికాంత్ దర్శకత్వంలో వారాహి చలనచిత్రం, లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో మిషా నారంగ్, చిత్రా శుక్లా కథానాయికలు.

శుక్రవారం ‘తెల్లవారితే గురువారం’ మూవీ టీజర్ విడుల చేశారు.. ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారని ఇంట్లో నుండి పారిపోయిన హీరో జీవితంలో ప్రేమతో ముడిపడ్డ ఫ్లాష్ బ్యాక్ ఈ సినిమా కథ అని క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేశారు. సింహా తన నటనతో ఆకట్టుకున్నాడు. విజువల్స్, ఆర్ఆర్ కూడా చక్కగా కుదిరాయి. ఈ సినిమాకి సంగీతం: కాల భైరవ, కెమెరా: సురేష్ రగుతు, ఎడిటింగ్: సత్య, నిర్మాతలు: రజనీ కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ.