YSR Nethanna Nestham : చేనేతకు చేయూత.. నేడు లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ.24 వేలు

చేనేత కార్మికులకు చేయూతనిచ్చేందుకు ఏపీ ప్రభుత్వం "వైఎస్ఆర్ నేతన్న నేస్తం" పథకం తీసుకొచ్చిన విషయం తెలిసిందే.. ఈ పథకం కింద అర్హులైన 80,032 మంది నేతన్నలకు రూ.190.08 కోట్ల రూపాయలను బ్యాంకు ఖాతాల్లో జమచేయనున్నారు. మంగళవారం సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో కంప్యూటర్ బటన్ నొక్కి ఖాతాల్లో జమ చేయనున్నారు.

YSR Nethanna Nestham : చేనేత కార్మికులకు చేయూతనిచ్చేందుకు ఏపీ ప్రభుత్వం “వైఎస్ఆర్ నేతన్న నేస్తం” పథకం తీసుకొచ్చిన విషయం తెలిసిందే.. ఈ పథకం కింద అర్హులైన 80,032 మంది నేతన్నలకు రూ.190.08 కోట్ల రూపాయలను బ్యాంకు ఖాతాల్లో జమచేయనున్నారు. మంగళవారం సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో కంప్యూటర్ బటన్ నొక్కి ఖాతాల్లో జమ చేయనున్నారు.

ఐదేళ్లలో ప్రతి లబ్ధిదారుడికి రూ.1,20,000

మగ్గం కలిగిన, అర్హులైన ప్రతి చేనేత కుటుంబానికి ఏటా రూ.24,000 చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తోంది. ఐదేళ్ల కాలంలో ప్రతి లబ్ధిదారుడు రూ.1,20,000 చొప్పున ఆర్థిక సాయం పొందనున్నారు. ఇప్పటికే రెండు విధాతల్లో 48,000 రూపాయలను చేనేత కార్మికులకు అందించింది ప్రభుత్వం. ప్రస్తుతం మూడవ దఫా ఆర్ధిక సాయం అందిస్తుంది.

గత రెండు దఫాల్లో నేతన్నలకు ప్రభుత్వం రూ.383.99 కోట్లు అందచేసింది. మంగళవారం మూడో విడత కింద ఇచ్చే రూ.192.08 కోట్లతో కలిపితే నేతన్నలకు రూ.576.07 కోట్ల సాయం అందించినట్లయింది.

ట్రెండింగ్ వార్తలు