Karnataka: కర్ణాటకలో కాంగ్రెస్ సర్కారు కొలువుదీరిన వేళ.. సోనియా గాంధీ వీడియో సందేశం.. ఏమన్నారంటే?

సోనియా గాంధీ వీడియో రూపంలో మాట్లాడుతూ పలు వ్యాఖ్యలు చేశారు.

Sonia Gandhi: కర్ణాటకలో కాంగ్రెస్ (Congress) పార్టీ ఘన విజయం సాధించినందుకు ఆ రాష్ట్ర ప్రజలకు యూపీఏ (UPA) ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ కృతజ్ఞతలు చెప్పారు. ఈ మేరకు ఆమె వీడియో రూపంలో మాట్లాడారు.

“నమస్కారం.. కర్ణాటకలో కాంగ్రెస్ కు ఇటువంటి ఘనవిజయం అందించిన ప్రజలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెబుతున్నాను. ఈ ప్రజా తీర్పు పేద ప్రజల ప్రభుత్వం ఏర్పాటు కావడానికి, ద్వేషపూరిత రాజకీయాలను ప్రజలు తిరస్కరించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుతాయి. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల శ్రేయస్సు, అభివృద్ధి కోసమే” అని సోనియా గాంధీ చెప్పారు. కర్ణాటకలో ఏర్పాటైన కొత్త ప్రభుత్వం ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుందని అన్నారు.

కాగా, కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ సహా పది మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. మేనిఫెస్టోలు ఇచ్చిన హామీల అమలుకు ప్రయత్నాలు తొలి రోజు నుంచే ప్రారంభిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటోంది.

Karnataka-Tamil Nadu: 5 హామీల అమలుకు అన్ని కోట్లు ఎలా వస్తాయి? 2 వేల నోట్లూ ఉండవు కదా?: బీజేపీ