Those who against free welfare schemes are traitors says kejriwal
Kejriwal on revdi: ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉచిత విద్యుత్, నిరుద్యోగ సౌకర్యం లాంటివి పొందడం ఈ దేశ పౌరుల హక్కని, వాటిని వ్యతిరేకించే వారు దేశ ద్రోహులని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. ‘రేవ్డీ’ అవసరం లేదంటూ వ్యాఖ్యానించిన బీజేపీ నేతలను లక్ష్యంగా చేసుకుని కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు ప్రభుత్వం అందించాల్సిన ఉచిత సౌకర్యాలను నేరంగా పరిగణించే వాతావరణాన్ని బీజేపీ కల్పిస్తోందని ఆయన దుయ్యబట్టారు. మరికొద్ది రోజుల్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ఉండడం.. గుజరాత్లో ఆప్ జోరు మీద ప్రచారం చేస్తుండడంతో కేజ్రీవాల్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
‘‘ప్రభుత్వం ఎందుకు ఉంది? ప్రజలకు కావాల్సిన అవసరాలు తీర్చకపోతే ఇక ప్రభుత్వం ఎందుకు? విద్య, వైద్యం, విద్యుత్, నిరుద్యోగులకు భృతి లేదంటే ఇతర సౌకర్యాలు ప్రజలకు ఉచితంగా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఈమాత్రం వారికి అందించకపోతే ఇక ప్రభుత్వం ఎందుకు? ప్రజలకు ఇవ్వాల్సిన ఈ సౌకర్యాలపై బీజేపీ హేళనగా మాట్లాడుతోంది. రేవ్డీ అంటూ జోకులు వేస్తోంది. ప్రజలకు ప్రభుత్వం అందించాల్సిన ఉచిత సౌకర్యాలను నేరంగా పరిగణించే వాతావరణాన్ని బీజేపీ కల్పిస్తోంది. నిజానికి ప్రజలకు ఉచితంగా అందించే పథకాలను వ్యతిరేకించేవారు దేశద్రోహులు’’ అని కేజ్రీవాల్ అన్నారు.
తాజాగా ఢిల్లీలో నేరాలను తగ్గించడానికి ప్రభుత్వం నూతన విధానాల్ని అవలంబిస్తున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. ముఖ్యంగా దొంగతనాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపనున్నారట. అధునాతన టెక్నాలజీతో చోరీకి గురైన ఫోన్లను ఐఎంఈఐ నెంబర్ ద్వారా పని చేయకుండా చేసే ఆధునిక టెక్నాలజీని ఢిల్లీ పోలీసుల చేతికి అందించినట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఒక సీనియర్ పోలీసు అధికారి ఫోన్ను ఇదే టెక్నాలజీ ఉపయోగించి బ్లాక్ చేయించినట్లు చెప్పుకొచ్చారు.
BJP next target NCP: ఉద్ధవ్ తర్వాతి బీజేపీ టార్గెట్ శరద్ పవార్!