BJP next target NCP: ఉద్ధవ్ తర్వాతి బీజేపీ టార్గెట్ శరద్ పవార్!

శరద్ పవార్‭తో పోటీ గురించి ఫడ్నవీస్‭ను ప్రశ్నించగా.. ‘‘16 నియోజకవర్గాల్లో బారామతి కూడా ఉంది. బారామతిలో మేం మంచి ఓట్లే సాధించాం. వచ్చే ఎన్నికల్లో అక్కడ పాగా వేయాలని అనుకుంటున్నాం. అందుకోసం అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆ నియోజవర్గానికి ఇంచార్జీగా ఉంటారు. మిగిలిన నియోజకవర్గాల్లో కూడా కేంద్ర మంత్రులు ఇంచార్జీలుగా ఉంటారు. బారామతికి సెప్టెంబర్ నెలలో నిర్మల వస్తారు’’ అని అన్నారు.

BJP next target NCP: ఉద్ధవ్ తర్వాతి బీజేపీ టార్గెట్ శరద్ పవార్!

BJP next target NCP after taking down Uddhav

BJP next target NCP: ఉద్ధవ్ థాకరే ప్రభుత్వాన్ని కూల్చిన అనంతరం మహారాష్ట్రలో మరింత శక్తివంతంగా తయారయ్యేందుకు భారతీయ జనతా పార్టీ ప్రణాళికలు రచిస్తున్నట్టు కనిపిస్తోంది. శివసేన చీలిపోయాక ఇక రాష్ట్రంలో ఎన్సీపీనే టార్గెట్ గా బీజేపీ పావులు కదుపుతోందట. తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు ఊతాన్ని ఇస్తున్నాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ కూతురు ఎంపీగా ఎన్నికైన బారామతిపై తన పార్టీ ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని, ఆ స్థానంలో రాజకీయ పావులు కదిపే బాధ్యతను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‭కు అధిష్టానం బాధ్యతలు అప్పగించిందని ఆయన అన్నారు. రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణతో పాటు ఇతర అంశాలపై చర్చించడానికి ఢిల్లీ వెళ్లిన ఫడ్నవీస్.. ముంబైకి వచ్చీ రాగానే ఈ ప్రకటన చేయడం చర్చనీయాంశంగా మారింది.

‘‘గత ఆరు నెలల నుంచి 16 పార్లమెంట్ స్థానాలపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టిందనే విషయం వాస్తవమే. ఇందులో ముఖ్యమంత్రి ఏక్‭నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే నియోజకవర్గం కూడా ఉంది. అయితే ప్రస్తుతం మేము షిండేతో పొత్తులో ఉన్న కారణంగా ఆ స్థానాన్ని లిస్ట్ నుంచి తొలగించాం. వచ్చే ఎన్నికల్లో బీజేపీ-శివసేన కలిసే పోటీ చేస్తాయి. మాతో ఉన్న వారందరి గెలుపుకు మాకు వీలైనంత కృషి చేస్తాం. మేం మరింత శక్తివంతం అయితే ఆ శక్తినంతటినీ కూడగట్టి మాతో ఉన్న శివసేన ఎంపీలందరినీ మళ్లీ ఎన్నికయ్యేలా చూస్తాం’’ అని ఫడ్నవీస్ అన్నారు.

ఇక శరద్ పవార్‭తో పోటీ గురించి ఫడ్నవీస్‭ను ప్రశ్నించగా.. ‘‘16 నియోజకవర్గాల్లో బారామతి కూడా ఉంది. బారామతిలో మేం మంచి ఓట్లే సాధించాం. వచ్చే ఎన్నికల్లో అక్కడ పాగా వేయాలని అనుకుంటున్నాం. అందుకోసం అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆ నియోజవర్గానికి ఇంచార్జీగా ఉంటారు. మిగిలిన నియోజకవర్గాల్లో కూడా కేంద్ర మంత్రులు ఇంచార్జీలుగా ఉంటారు. బారామతికి సెప్టెంబర్ నెలలో నిర్మల వస్తారు’’ అని అన్నారు.

ఎన్సీపీకి పశ్చిమ మహారాష్ట్రలో మంచి పట్టు ఉంది. ఇక విదర్భ ప్రాంతంలో బీజేపీ గట్టిగానే ఉంది. ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం ఉన్న నాగపూర్ పరిసర ప్రాంతం కావడంతో కాషాయ పార్టీ బలంగానే ఉంది. దీంతో పశ్చిమ మహారాష్ట్రపై బీజేపీ దృష్టి సారించింది. ఉద్ధవ్ వర్గం బలహీనం కావడం, చీలిన శివేసన తమతోనే ఉండడంతో ఎన్సీపీనే తర్వాతి టార్గెట్ అని బీజేపీ భావిస్తోంది.

Uddhav back as editor: పవార్, మమతలను టార్గెట్ చేసిన ఉద్ధవ్