సుమ క్లాప్‌తో ‘పద్మశ్రీ’ బ్రహ్మానందం, రాహుల్‌ విజయ్‌ సినిమా ప్రారంభం..

సుమ క్లాప్‌తో ‘పద్మశ్రీ’ బ్రహ్మానందం, రాహుల్‌ విజయ్‌ సినిమా ప్రారంభం..

Updated On : February 24, 2021 / 1:36 PM IST

New Movie: ‘పద్మశ్రీ’ బ్రహ్మానందం, యువ హీరో రాహుల్‌ విజయ్‌, ‘మత్తు వదలరా’ ఫేమ్‌ నరేష్‌ అగస్త్య ముఖ్య తారలుగా టికెట్‌ ఫ్యాక్టరీ, ఎస్‌ ఒరిజినల్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రొడక్షన్‌ నెం1 సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. దివ్య శ్రీపాద, శ్రీవిద్య, వికాస్‌, ఉత్తేజ్‌, ప్రాణ్య పి రావు తదితరులు ఈ చిత్రంలో ఇతర తారాగణం. హర్ష పులిపాక రచన, దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి అఖిలేష్‌ వర్ధన్‌, సృజన్‌ ఎరబోలు నిర్మాతలు. పూజా కార్యక్రమాల అనంతరం రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభించారు.

New Movie

 

ఈ సందర్భంగా నిర్మాత సృజన్‌ ఎరబోలు మాట్లాడుతూ.. ‘‘బ్రహ్మానందం గారు, రాహుల్‌ విజయ్‌, నరేష్‌ అగస్త్యతో పాటు మరో ముగ్గురు స్టార్లు ఈ సినిమాలో నటించనున్నారు. త్వరలో ఆ స్టార్లు ఎవరనేది వెల్లడిస్తాం. హైదరాబాద్‌లో రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభించాం. 13 రోజుల పాటు ఏకధాటిన నగరంలోనూ, నగర పరిసర ప్రాంతాల్లో తొలి షెడ్యూల్‌ చేస్తాం. విశాఖ, పాండిచ్చేరిలో తదుపరి షెడ్యూల్స్‌ ప్లాన్‌ చేశాం. ‘కలర్‌ ఫొటో’తో ప్రేక్షకులతో పాటు పరిశ్రమ దృష్టిని ఆకర్షించిన దర్శకుడు సందీప్‌ రాజ్‌ మా చిత్రానికి మాటలు రాయడం సంతోషంగా ఉంది. అలాగే, వరుస విజయాల్లో ఉన్న సంగీత దర్శకుడు ప్రశాంత్‌ ఆర్‌. విహారి సంగీతం అందిస్తున్నారు’’ అని అన్నారు.

New Movie

ఈ చిత్రంతో రచయితగా, దర్శకుడిగా పరిచయమవుతున్న హర్ష పులిపాక మాట్లాడుతూ.. ‘‘ప్రతి జీవికి అవసరమైన పంచేంద్రియాలు – చూపు, వినికిడి, రుచి, స్పర్శ, వాసన… ఏవైతే ఉన్నాయో వాటి చుట్టూ అల్లుకున్న కథతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నాం. మనిషి మనుగడకు అవసరమైన అటువంటి ఎన్నో భావోద్వేగాలను వివరిస్తూ సాగేది మా సినిమా. యువతరం ఆలోచనలు, వాళ్ల దృక్పథాలకు అద్దం పట్టేలా కథ, కథనాలు నిజాయతీగా ఉంటాయి. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా సినిమా ఉంటుంది’’ అన్నారు.

New Movie