Schools Closed In Assam (1)
Tihar jail In Delhi : ఢిల్లీలోని తీహార్ జైల్లో ఓ ఖైదీ సెల్ ఫోన్ మింగేసాడు. అధికారులు తనిఖీలకు వస్తున్నారని తెలిసి తనవద్ద ఫోన్ ఉందని తెలుస్తుందనే భయంతో ఓ ఖైదీ సెల్ ఫోన్ మింగేశాడు. దీంతో అధికారులు సదరు ఖైదీని వెంటనే ఆసుపత్రికి తరలించిన ఘటన ఢిల్లీలోని తీహార్ లోజైల్లో జనవరి 5న చోటుచేసుకుంది. ఖైదీలు ఉండే సెల్స్ తనిఖీలు చేపట్టారు అధికారులు. ఈక్రమంలో ఓ ఖైదీ భయంతో సెల్ ఫోన్ ను మింగేశాడు.
ఇది చదవండి : NW China Quake : చైనాలో భారీ భూకంపం.. వరుసగా 3 సార్లు.. తీవ్రత 6.9గా నమోదు..!
ఈ ఘటనపై జైళ్ల శాఖ డీజీ సందీప్ గోయల్ మీడియాతో మాట్లాడుతు..జైలు నెం.1లో ఓ అండర్ ట్రయల్ ఖైదీ సెల్ ఫోన్ ఉపయోగిస్తున్నాడనే విషయం జైలు అధికారులకు తెలిసిందని..ఈ విషయం తెలిసిన సదరు ఖైదీ అధికారులు తన సెల్ వద్దకు వస్తున్న క్రమంలో భయపడి ఫోన్ ను మింగేశాడని తెలిపారు.అతడిని వెంటనే డీడీయూ ఆసుపత్రికి తరలించామని..ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని తెలిపారు. అయితే ఆ ఫోన్ ఇంకా అతడి పొట్టలోనే ఉందని డాక్టర్ల సూచనమేరకు సర్జరీ చేసి తీయాలా? అనే విషయంపై ఆలోచిస్తున్నామని తెలిపారు.
ఇది చదవండి : Assam : అస్సాంలో జనవరి 30 వరకు స్కూల్స్ బంద్..ఆంక్షలు మరింత కఠినం