TikTok దేశీ వెర్షన్ Mitron యాప్ వచ్చేసింది..అచ్చం పాకిస్తాన్ TicTic లాగ ఉందేంటి?

  • Publish Date - May 30, 2020 / 05:50 AM IST

టిక్ టాక్ దేశీ వెర్షన్ ‘మిట్రాన్’ యాప్ ఇండియాది కాదు. కానీ, పాకిస్థాన్ సాఫ్ట్ వేర్ డెవలపర్ Qboxus నుంచి తీసుకొచ్చినట్టు ఓ రిపోర్టు తెలిపింది. అయినప్పటికీ వీడియో షేరింగ్‌ ప్లాట్‌ఫాం టిక్‌టాక్‌ మాదిరిగానే మిట్రాన్ యాప్ కూడా ఫుల్ పాపులర్ అయింది. చైనా టిక్ టాక్ పోటీగా వచ్చిన మిట్రాన్.. 5 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్ అయినట్టు ఇటీవలే వార్తల్లో నిలిచింది. వాస్తవానికి ఈ యాప్ అసలు పేరు TicTic. దీన్ని రీబ్రాండెడ్ చేసి మిట్రాన్ యాప్ గా మార్కెట్లోకి రిలీజ్ చేశారు. ఏప్రిల్ 11న ఈ యాప్ లాంచ్ కాగా, ఐఐటీ రోర్కీలోని విద్యార్థి శివాంక్ అగర్వాల్‌కు డెవలపింగ్ క్రెడిట్ ఇచ్చారు. మిట్రాన్ అనేది షార్ట్ వీడియో మేకింగ్ అప్లికేషన్. ఇందులోని యూజర్లు 15 సెకన్ల నిడివి గల షార్ట్ వీడియోలను అప్ లోడ్ చేసుకోవచ్చు. 

అయితే మిట్రాన్ యాప్.. తాను స్వయంగా డెవలప్ చేయలేదనే విషయాన్ని పలు మీడియా రిపోర్టులో వెల్లడించాడు. కానీ, TicTic కోడ్ కొనుగోలు చేసిన అగర్వాల్.. యాప్ రీబ్రాండ్ చేసినట్టు తెలిపాడు. టిక్ టిక్.. మిట్రాన్.. ఈ రెండు యాప్ ల సోర్స్ కోడ్ లను డికంపైల్ చేసిన తర్వాత అందులోని కొన్ని స్ట్రింగ్స్ టిక్ టిక్‌లో అలానే వదిలేశారు. com.dinosoftlabs.tictic>>Main_Menu>>MainMenuFragment”మిట్రాన్ యాప్ కోడ్ ఇలా కనిపిస్తుంది.

కానీ, ‘tictic’.Moreover, యాప్‌లో మాత్రం “com.dinosoftlabs.tictic” కోడ్ తో ఆండ్రాయిడ్ ప్యాకేజీ పేరు కలిగి ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్ ఐడీని Qboxus మిట్రాన్ యాప్ పబ్లీష్ చేసింది. ప్రీ-బుల్ట్ సైట్లు, స్ర్కిప్టులు, ప్లగిన్ అప్లికేషన్లు, థీమ్స్ కొనుగోలు చేసే వెబ్ సైట్  Code Canyon నుంచి మైక్రో వీడియో షేరింగ్ యాప్ సోర్స్ కోడ్‌ను QBoxus సేల్‌లో పెట్టింది. సుమారుగా దీని ధర 34 డాలర్లు అంటే.. రూ.2,570 ఉంటుంది. tictic అప్లికేషన్ సోర్స్ కోడ్‌ను 274 సార్లు అమ్మినట్టు Code Canyon వెబ్ సైట్లో పేర్కొంది. 

కొత్త యాప్‌ మిట్రాన్‌ గుగూల్‌ ప్లేస్టోర్‌ రేటింగ్‌లో టిక్‌టాక్‌ను అధిగమించింది. ఇప్పటి వరకు గుగూల్‌ ప్లే స్టోర్‌ రేటింగ్‌లో టిక్‌టాక్‌, యూట్యూబ్‌లు మాత్రమే పోటీ పడేవి.
తాజా నివేదిక ప్రకారం గుగూల్‌ రేటింగ్‌లో టిక్‌టాక్‌, యూట్యూబ్‌లను మిట్రాన్‌‌ యాప్‌ అధిగమించి 4.7 రేటింగ్‌తో ట్రేండింగ్‌లో ఉంది. అంతేగాక ప్లే స్టోర్‌లో యూజర్లు
టిక్‌టాక్‌కు తక్కువ రేటింగ్, నెగటివ్‌ ఫీడ్‌బ్యాక్‌ ఇవ్వడంతో టిక్‌టాక్ ప్లే స్టోర్‌‌ రేటింగ్‌ 1కి పడిపోయింది. ప్రస్తుతం టిక్‌టాక్‌కు ప్లేస్టొర్‌లో 1.4 రేటింగ్‌తో ఉంది. మిట్రాన్ యాప్‌‌
ప్లే స్టోర్‌లో 5 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్‌లను కలిగి 4.7 రేటింగ్‌తో ప్లే స్టోర్‌లో దూసుకుపోతుంది. అతి తక్కువ సమయంలోనే 5 మిలియన్లకు పైగా యూజర్లను పొంది
4.7 రేటింగ్‌తో మిట్రాన్‌ ట్రేండింగ్‌ యాప్‌ల జాబితాలో చేరిపోయింది. 

ఆండ్రాయిడ్ ఫోన్లలో మాత్రమే మిట్రాన్ యాప్ పనిచేస్తుంది. గూగుల్ ప్లే స్టోర్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే మీ స్మార్ట్‌ఫోన్‌లో కనీస స్టోరేజీ ఉంటే సరిపోతుంది. 8MP ఫైల్ సైజు ఉంటుంది. ఆండ్రాయిడ్ 5.0 కలిగిన ఏ డివైస్‌లోనైనా మిట్రాన్ డౌన్‌లోడ్‌ అవుతుంది. దీనికి ios యాక్సెస్‌కు అనుమతి‌ లేదు.

Read: Motorola India మరో స్మార్ట్ ఫోన్