Spam Calls Block : మీరు స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? మీ ఫోన్‌లో స్పామ్ కాల్స్ ఒకేసారి బ్లాక్ చేయొచ్చు తెలుసా? ఇదిగో ప్రాసెస్..!

Spam Calls Block : ప్రస్తుత రోజుల్లో గుర్తు తెలియని నెంబర్ల నుంచి ఫోన్ కాల్స్ వస్తుంటాయి. అందులో ఎక్కువగా టెలిమార్కెటింగ్ వంటి స్పామ్ కాల్‌లతో విసిగిపోయారా? సరే.. మీరు పనిలో లేదా మీటింగ్‌లో ఉన్నప్పుడు కూడా ఇలాంటి అన్ వాటెండ్ కాల్‌లు తరచుగా చికాకు కలిగిస్తుంటాయి.

Spam Calls Block : ప్రస్తుత రోజుల్లో గుర్తు తెలియని నెంబర్ల నుంచి ఫోన్ కాల్స్ వస్తుంటాయి. అందులో ఎక్కువగా టెలిమార్కెటింగ్ వంటి స్పామ్ కాల్‌లతో విసిగిపోయారా? సరే.. మీరు పనిలో లేదా మీటింగ్‌లో ఉన్నప్పుడు కూడా ఇలాంటి అన్ వాటెండ్ కాల్‌లు తరచుగా చికాకు కలిగిస్తుంటాయి. అలాంటి స్పామ్ కాల్స్ వచ్చినప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుంది. తరచుగా ఇలాంటి కాల్స్ కారణంగా, యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్‌లను సైలెంట్ మోడ్‌లో ఉంచుతుంటారు. ఈ క్రమంలో మీకు వచ్చే కొన్ని ముఖ్యమైన కాల్‌లను కూడా మిస్ అయ్యే అవకాశం ఉంటుంది.

కొన్నిసార్లు ఈ స్పామ్ కాల్‌లో మోసపూరిత కాల్స్, బ్యాంక్ లేదా సంబంధిత ఇతర మోసపూరిత కాల్స్ ఎక్కువగా వస్తుంటాయి. ఈ కాల్‌లను కంట్రోల్ చేసేందుకు యూజర్లు తమ కాంటాక్టులను బ్లాక్ చేసేందుకు ప్రయత్నిస్తారు. అయితే, ప్రతి స్పామ్ నంబర్‌ను బ్లాక్ చేయాలంటే అది సాధ్యం కాదు. కానీ, మీరు స్పామ్ కాల్‌లను బల్క్‌లో బ్లాక్ చేసి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. స్పామ్ కాల్స్, మెసేజ్‌లు రాకుండా ఉండేందుకు ఒక మార్గం ఉంది. మీరు ఈ స్పామ్ లేదా టెలిమార్కెటింగ్ కాల్స్ రాకుండా ఆపవచ్చు. అందుకు అనేక మార్గాలు ఉన్నాయి. అవేంటో ఓసారి వివరంగా పరిశీలిద్దాం..

Tired of too many spam calls_ Here is how to block them all at once

ఏదైనా నంబర్‌ (DND)ని ఎలా యాక్టివేట్ చేయాలి :
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR)ని ప్రారంభించింది. గతంలో నేషనల్ డూ నాట్ కాల్ రిజిస్ట్రీ (NDNC) స్పామ్ కాల్‌లను బ్లాక్ చేయడంలో యూజర్లకు సాయపడుతోంది. ఎంచుకున్న రంగాల నుంచి అన్ని టెలిమార్కెటింగ్ కమ్యూనికేషన్ లేదా కాల్‌లను ఆపేందుకు యూజర్లు ఆయా సర్వీసులో సైన్-అప్ చేయవచ్చు.

* మీ నంబర్‌లో DNDని యాక్టివేట్ చేయాలంటే ఇలా చేయండి..
* మీ SMS యాప్‌ని ఓపెన్ చేసి START అని టైప్ చేయండి.
* ఇప్పుడు ఈ మెసేజ్ 1909కి పంపండి.
* మీ సర్వీస్ ప్రొవైడర్ మీకు కేటగిరీల లిస్టును పంపుతారు ఉదా. బ్యాంకింగ్, హాస్పిటాలిటీ, ఇతరులవి ఉంటాయి.
* మీరు బ్లాక్ చేయాలనుకుంటున్న కేటగిరీ కోసం కోడ్‌తో రిప్లే ఇవ్వండి.
* మీ టెలికాం సర్వీస్ ప్రొవైడర్ మీ రిక్వెస్టును నిర్ధారిస్తూ మీకు మెసేజ్ పంపుతుంది.
* DND సర్వీసు 24 గంటల్లో ప్రారంభమవుతుంది.

DND యాక్టివేషన్ అన్‌వాటెండ్ థర్డ్-పార్టీ కమర్షియల్ కాల్‌లను మాత్రమే బ్లాక్ చేస్తుందని గమనించాలి. మీ బ్యాంక్ నుంచి SMS అలర్ట్‌లు, ఆన్‌లైన్ పోర్టల్స్, సర్వీస్‌ల నుంచి కమ్యూనికేషన్‌లు, థర్డ్-పార్టీ పర్సనల్ కాలింగ్ మొదలైనవాటిని నిరోధించదని జాతీయ వినియోగదారుల ప్రాధాన్యత రిజిస్టర్ తెలిపింది. మీరు మీ టెలికాం సర్వీస్ ఆపరేటర్ల ద్వారా DND సర్వీసులను కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు. Jio, Airtel, Vodafoneలో DNDని రిజిస్టర్ చేసేందుకు ఈ కింది విధంగా ప్రయత్నించవచ్చు.

Jioలో DNDని ఎలా యాక్టివేట్ చేయాలంటే?

Tired of too many spam calls_ Here is how to block them all at once

* MyJio యాప్‌కి వెళ్లండి.
* ఇప్పుడు Settings -> Service settings -> Do not disturb
* కాల్‌లు, మెసేజ్‌లను రిసీవ్ చేసుకోకుండా మీరు బ్లాక్ చేసే కేటగిరీలను ఎంచుకోండి.
* Airtelలో DNDని ఎలా యాక్టివేట్ చేయాలి
* ఎయిర్‌టెల్ అధికారిక సైట్‌ని airtel.in/airtel-dnd. విజిట్ చేయండి.
* మీ మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేయండి
* వెరిఫై చేసేందుకు మీ నంబర్‌కు వచ్చిన OTPని రిజిస్టర్ చేయండి.
* మీరు బ్లాక్ చేయాలనుకుంటున్న కేటగిరీలను ఎంచుకోండి.
* Viలో DNDని ఎలా యాక్టివేట్ చేయాలి
* Discover.vodafone.in/dndని ఓపెన్ చేయండి.
* మీ మొబైల్ నంబర్, ఈ-మెయిల్ చిరునామా, పేరు రిజిస్టర్ చేయండి.
* మీరు మార్కెటింగ్ కాల్‌లను పొందకుండా బ్లాక్ చేయాలనుకునే కేటగిరీలను ఎంచుకోండి.

* BSNLలో DNDని ఎలా యాక్టివేట్ చేయాలి.
* మీ BSNL నంబర్ నుంచి 1909కి “start dnd” అనే మెసేజ్ పంపండి
* అందుకున్న ఆప్షన్ నుంచి మీరు బ్లాక్ చేయాలనుకుంటున్న కేటగిరీలను ఎంచుకోండి.
* మీరు వాయిస్ కాల్, SMS లేదా అన్నింటితో సహా మోడ్ నుంచి కూడా ఎంచుకోవచ్చు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Infinix Hot 20 5G : ఇన్ఫినిక్స్ నుంచి Hot 20 5G ఫోన్ వచ్చేస్తోంది.. డిసెంబర్ 1నే లాంచ్.. ధర ఎంత ఉండొచ్చుంటే?

ట్రెండింగ్ వార్తలు