Hanuman Jayanti 2021 : టీటీడీ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి వేడుకలు

తిరుమల తిరుపతి దేవస్ధానం ఆధ్వర్యంలో ఈనెల4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు హనుమాన్ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తామని టీటీడీ అదనపు ఈఓ ధర్మారెడ్డి తెలిపారు.

Hanuman Jayanti 2021 : తిరుమల తిరుపతి దేవస్ధానం ఆధ్వర్యంలో ఈనెల4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు హనుమాన్ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తామని టీటీడీ అదనపు ఈఓ ధర్మారెడ్డి తెలిపారు.
అంజానాద్రే హనుమంతుని జన్మస్ధలమని టీటీడీ ప్రకటించిన నేపథ్యంలో ఈ ఏడాది ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్విహిస్తామని ఆయన చెప్పారు.

బేడీ ఆంజనేయ స్వామి గుడి…ఘాట్ రోడ్డులో ఉన్న  ప్రసన్నాంజనేయస్వామి వారికి యధావిధిగా పూజలనిర్వహిస్తామని ఆయన చెప్పారు. ఆంజనేయ స్వామి మాతృమూర్తి అంజనాదేవి, తిరుమల కొండల్లోని  గుహలో ఎక్కడ   తప్పస్సు చేశారో అక్కడ అంజనాదేవి, బాల ఆంజనేయ స్వామివారి ఆలయాలు నిర్మించామని ధర్మారెడ్డి తెలిపారు.

కాగా …హనుంతుడి జన్మస్ధలంపై కొద్దిరోజులుగా నెలకొన్న వివాదానికి టీటీడీ నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసి ఇటీవలే ఆవివాదానికి తెరదించింది. అనంతరం టీటీడీ ప్రకటనను స్వామి
గోవిందానంద  సరస్వతి వ్యతిరేకించారు. ఈవిషయమై ధర్మారెడ్డి మాట్లాడుతూ…. పురాణ, వాజ్మయ, భౌగోళిక ఆధారాలతో అంజనాద్రే హనుమంతుని జన్మ స్థలం అని టీటీడీ ఏర్పాటు చేసిన కమిటీ
నిర్ధారించిందని…. గోవిందానంద సరస్వతి వ్యతిరేకిస్తే ఆపాలని లేదని అన్నారు.

దైవ సాక్షాత్కారం పొందిన మహాపురుషులు అన్నమయ్య లాంటి వారే అంజనాద్రే హనుమంతుని జన్మ స్థలమని చెప్పారు…టీటీడీ నిర్ణయం తప్పు అనివారు ఎవరైనా నిరూపించాలని ధర్మారెడ్డి  అన్నారు. అత్యంత నిష్ణాతులతో కమిటీ వేశామని, కమిటీని ఆక్షేపణ చేసే వాళ్లకు ఏమీ తెలియలేదని అర్థం  అవుతోందని ఆయన అన్నారు. అన్నీ తెలిసిన వాళ్ళు ఎవరూ కమిటీ రిపోర్టును ఆక్షేపణ చేయరు. హనుమంతుని జన్మ స్థలం తిరుమలలోని అంజనాద్రే అని పురాణాలు ఏకకంఠంతో ఘోషిస్తున్నాయని  ధర్మారెడ్డి అన్నారు.

 

ట్రెండింగ్ వార్తలు