Panchayat president Sudha: దళిత్ అని పంచాయతీ ప్రెసిడెంట్‭ జాతీయ జెండా ఎగురవేయనివ్వలేదు

Panchayat president Sudha: తాను దళిత కమ్యూనిటికీ చెందిన వ్యక్తి కావడంతో ప్రభుత్వ పాఠశాలలో జెండా ఎగురవేయనివ్వలేదని తమిళనాడులోని కళ్లకురిచి జిల్లాలో ఉన్న ఎడుతవైనతం గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ సుధ వి వాపోయారు. ఈ విషయమై ఆమె జిల్లా డిప్యూటీ ఎస్పీకి లేఖ రాశారు. ఈ లేఖలో తాను పాఠశాలలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవానికి వెళ్లానని, అయితే అక్కడ తనను జెండా ఎగరవేయనీయకుండా అడ్డుకున్నారని ఆమె లేఖలో పేర్కొన్నారు. గతంలో ఉన్న ప్రెసిడెంట్లు గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర్య దినోత్సవాల్లో పాఠశాలలో ఎగురవేశారని, తాను దళిత కమ్యూనిటీకి చెందిన వ్యక్తని తనను ఎగురవేయనీయలేదని అన్నారు.

‘‘నేను షెడ్యూల్డ్ క్యాస్ట్‭కు చెందిన మహిళను. నేను మా గ్రామంలోని పాఠశాలలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవాలకు వెళ్లాను. అయితే అక్కడి పేరెంట్ టీచర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అరుల్కుమార్, వైస్ ప్రెసిడెంట్ కన్నన్.. నన్ను జెండా ఎగురవేయనీయకుండా అడ్డుకున్నారు’’ ఆగస్టు 3న కళ్లకురిచి జిల్లా డిప్యూటీ ఎస్పీకి లేఖ రాశారు. అనంతరం తనకు వారి నుంచి హాని ఉందని, తనకు రక్షణ కావాలని డిప్యూటీ ఎస్పీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.

Sushil Modi: ఎన్నికలకు ముందే బిహార్‌లో ప్రభుత్వం కూలిపోతుంది: బీజేపీ నేత సుశీల్ మోదీ

ట్రెండింగ్ వార్తలు