Sushil Modi: ఎన్నికలకు ముందే బిహార్‌లో ప్రభుత్వం కూలిపోతుంది: బీజేపీ నేత సుశీల్ మోదీ

రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందే బిహార్‌లో నితీశ్-తేజస్వి ఆధ్వర్యంలోని ప్రభుత్వం కూలిపోతుందని అభిప్రాయపడ్డారు బీజేపీకి చెందిన బిహార్ నేత, ఎంపీ సుశీల్ మోదీ. రాష్ట్రంలో ఇకపై తేజస్వినే తెరవెనుక అసలైన సీఎంగా ఉంటారని ఆయన అన్నారు.

Sushil Modi: ఎన్నికలకు ముందే బిహార్‌లో ప్రభుత్వం కూలిపోతుంది: బీజేపీ నేత సుశీల్ మోదీ

Sushil Modi: బిహార్‌లో 2025లో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందే నితీశ్-తేజస్వి ప్రభుత్వం కూలిపోతుందని అభిప్రాయపడ్డారు బీజేపీకి చెందిన బిహార్ నేత, ఎంపీ సుశీల్ మోదీ. బుధవారం బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్, ఉప ముఖ్యమంత్రిగా తేజస్వి యాదవ్ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే.

Rajasthan: 70 ఏళ్ల వయసులో తల్లైన మహిళ.. పెళ్లైన 54 ఏళ్లకు తల్లిదండ్రులుగా మారిన జంట

బిహార్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరడంపై బీజేపీ విమర్శలు చేస్తోంది. బీజేపీ నేత సుశీల్ ఈ అంశంపై పాట్నాలో మీడియాతో మాట్లాడారు. ‘‘ఆర్‌జేడీని నితీశ్ అణచి వేయాలనుకుంటున్నారు. లాలూ అనారోగ్యాన్ని సాకుగా చూపి, ఆ పార్టీలో చీలిక తీసుకురాబోతున్నారు. కొత్త ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో చూడాలనుకుంటన్నాం. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఈ ప్రభుత్వం కూలిపోతుంది. మేం నితీశ్ ఆధ్వర్యంలోని జేడీ (యూ) ప్రభుత్వాన్ని కూల్చాలని ప్రయత్నిస్తున్నట్లు ఆ పార్టీ ఆరోపిస్తోంది. దీనికి మహారాష్ట్రలో శివసేనను సాకుగా చూపుతోంది. శివసేన అక్కడ మా మిత్ర పక్షం కాదు. కానీ, ఇక్కడ జేడీ (యూ) మాకు మిత్ర పక్షంగా ఉంది. మేం ఎందుకు మా ప్రభుత్వాన్ని కూల్చాలనుకుంటాం.

TTD: తిరుమలలో పెరిగిన రద్దీ.. భక్తులకు టీటీడీ ప్రత్యేక సూచన

మా మిత్ర పక్షాల్ని మేం ఎప్పుడూ కూల్చలేదు. ఇప్పుడు తేజస్వి యాదవ్ తెరవెనుక సీఎంగా వ్యవహరిస్తారు. నితీశ్ కుమార్ నామమాత్రపు సీఎంగా మిగిలిపోతారు. అసలైన సీఎంగా తేజస్వినే ఉంటారు’’ అని సుశీల్ మోదీ వ్యాఖ్యానించారు.