TTD: తిరుమలలో పెరిగిన రద్దీ.. భక్తులకు టీటీడీ ప్రత్యేక సూచన

తిరుమల రావాలనుకుంటున్న భక్తులకు టీటీడీ బోర్డు ఒక సూచన చేసింది. రాబోయే ఐదు రోజులు రద్దీ పెరగనుండటంతో దివ్యాంగులు, వృద్ధులు, చిన్న పిల్లల తల్లిదండ్రులు తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని సూచించింది.

TTD: తిరుమలలో పెరిగిన రద్దీ.. భక్తులకు టీటీడీ ప్రత్యేక సూచన

TTD: తిరుమల పవిత్ర పుణ్య క్షేత్రంలో బుధవారం భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. సర్వదర్శనం కోసం భక్తులు 18 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. మరోవైపు రాబోయే ఐదు రోజులపాటు వరుస సెలవులు ఉండటతో భక్తుల రద్దీ ఇంకా పెరిగే అవకాశం ఉందని టీటీడీ భావిస్తోంది.

Rajasthan: 70 ఏళ్ల వయసులో తల్లైన మహిళ.. పెళ్లైన 54 ఏళ్లకు తల్లిదండ్రులుగా మారిన జంట

ఈ నేపథ్యంలో, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని టీటీడీ అప్రమత్తమైంది. మరో ఐదు రోజులపాటు దివ్యాంగులు, వృద్ధులు, చిన్న పిల్లల తల్లిదండ్రులు తిరుమల రావొద్దని సూచించింది. తిరుమలకు వచ్చే భక్తులు ముందుగానే పక్కా ప్రణాళికతో రావాలని సూచించింది. వసతి సౌకర్యం కూడా బుక్ చేసుకుని ఉన్నవారు, ఎక్కువ సమయం వేచి చూడగలిగే వారు మాత్రమే ఈ ఐదు రోజుల్లో రావాలని సూచించింది. లేకుంటే భక్తులు ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పింది. గురువారం నుంచి మరో పది రోజులైనా రద్దీ ఉండే అవకాశం ఉందని టీటీడీ అంచనా.

Priyanka Gandhi: కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీకి కోవిడ్ పాజిటివ్

నేడు జరిగే పూర్ణాహుతితో తిరుమలలో పవిత్రోత్సవాలు ముగుస్తాయి. శ్రీవారి పవిత్రోత్సవాల సందర్భంగా దర్శనానికి ఆలస్యం అవుతోందని టీటీడీ అధికారులు చెప్పారు. మరోవైపు నేటి నుంచి ద్వారకా తిరుమలలో పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు.