Rajasthan: 70 ఏళ్ల వయసులో తల్లైన మహిళ.. పెళ్లైన 54 ఏళ్లకు తల్లిదండ్రులుగా మారిన జంట

70 ఏళ్ల వయసులో ఒక మహిళ మగ బిడ్డకు జన్మనిచ్చింది. అది కూడా ఐవీఎఫ్ పద్ధతిలో. దీంతో పెళ్లైన 54 ఏళ్లకు తల్లిదండ్రులుగా మారింది ఆ జంట. ఇన్నేళ్లకు తమ కలను నెరవేర్చుకుంది. ఈ ఘటన రాజస్థాన్‌లో జరిగింది.

Rajasthan: 70 ఏళ్ల వయసులో తల్లైన మహిళ.. పెళ్లైన 54 ఏళ్లకు తల్లిదండ్రులుగా మారిన జంట
ad

Rajasthan: రాజస్థాన్‌లో ఒక మహిళ అరుదైన ఘనత సాధించింది. తన 70 ఏళ్ల వయసులో తొలిసారిగా మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో తల్లిదండ్రులు కావాలన్న తమ కలను పెళ్లైన 54 ఏళ్ల తర్వాత నెరవేర్చుకుందో జంట. రాజస్థాన్‌లోని ఆల్వార్ జిల్లా, ఝున్‌ఝును ప్రాంతానికి చెందిన చంద్రావతి-గోపీ సింగ్ అనే జంటకు పెళ్లై 54 ఏళ్లైనా సంతానం లేదు. ప్రస్తుతం గోపీ సింగ్ వయసు 75 కాగా, చంద్రావతి వయసు 70. వీరిద్దరూ సంతానం కోసం చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తున్నారు.

Nitish Kumar: నితీశ్ కుమార్ సపరేట్ రికార్డ్.. 22ఏళ్లలో 8వ సారి సీఎం

అనేక ప్రాంతాల్లోని ఆస్పత్రులకు వెళ్లినా, ఎక్కడా సంతానం కలగలేదు. దీని కోసం చేసిన అనేక ప్రయత్నాలు విఫలమయ్యాయి. అయినా తమ ఆశ వదలకుండా సంతానం కోసం చూస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఆల్వార్ జిల్లాలో ఉన్న ఒక ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) సెంటర్‌ను సంప్రదించారు. అక్కడి వైద్యులు వీరిని పరీక్షించి, పిల్లలు కలిగేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించారు. ఇంకా వీరికి సంతానం కలిగే అవకాశం ఉండటంతో ఐవీఎఫ్ విధానంలో ప్రయత్నించగా, మూడోసారి విజయవంతమైంది. దాదాపు తొమ్మిది నెలల క్రితం ఐవీఎఫ్ విధానంలో చంద్రావతి గర్భం దాల్చింది. అయినప్పటికీ ఆమె వయసు ఎక్కువ కావడం వల్ల సంతానం విషయంలో వైద్యులు కొంత సందేహించారు. అయితే, ఏ ఇబ్బందీ లేకుండా గత సోమవారం ఆమె మగ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు. బిడ్డ దాదాపు మూడున్నర కేజీల బరువున్నట్లు వైద్యులు చెప్పారు.

Koffee with Karan : మీ అన్న నీ ఫ్రెండ్స్ ఎంతమందితో బెడ్ షేర్ చేసుకున్నాడు.. అన్నా చెల్లిల్లని కూడా వదలని కరణ్ జోహార్..

తమ 54 ఏళ్ల కల నెరవేరడంతో ప్రస్తుతం ఆ జంట ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. బిడ్డకు జన్మనివ్వడంలోనే కాదు.. మరో విషయంలో కూడా ఈ జంట అదృష్టవంతులే అని చెప్పాలి. ఎందుకంటే గత జూన్ నుంచి కేంద్రం కొత్త చట్టం తీసుకొచ్చింది. అదేంటంటే 50 ఏళ్లలోపు మహిళలకు మాత్రమే ఐవీఎఫ్ విధానంలో పిల్లల్ని కనేందుకు ప్రభుత్వం అనుమతించింది. తాజాగా అమల్లోకి వచ్చిన చట్టం ప్రకారం.. 50 ఏళ్లు దాటిన మహిళలు ఐవీఎఫ్ పద్ధతిలో పిల్లల్ని కనడానికి వీల్లేదు. కానీ, ఈ చట్టం అమల్లోకి వచ్చేలోపే చంద్రావతి గర్భం దాల్చి ఉండటంతో ఆమె బిడ్డను కనగలిగింది.