India vs New Zealand T20 Match: సిరీస్‌పై గురి.. నేడు కివీస్‌తో టీమిండియా టీ20 మ్యాచ్.. వర్షం ముప్పు తప్పదా?

India vs New Zealand T20 Match: టీమిండియా వర్సెస్ న్యూజీలాండ్ జట్ల మధ్య 3వ టీ20 మ్యాచ్ మంగళవారం జరుగుతుంది. నేపియర్‌లోని మెక్‌లీన్ పార్క్‌ మైదానంలో మధ్యాహ్నం 12గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి మ్యాచ్ వర్షంకారణంగా రద్దుకాగా.. రెండో టీ20 మ్యాచ్‌లో ఇండియా విజయం సాధించింది. సిరీస్‌లో నేడు జరిగే చివరి మ్యాచ్‌లో సత్తాచాటి సిరీస్ ను కైవసం చేసుకోవాలని టీమిండియా కుర్రాళ్లు పట్టుదలతో ఉన్నారు.

India Vs New Zealand 2nd T20 : కివీస్‌తో రెండో టీ20.. భారత్ టార్గెట్ 154

నేడు జరిగే మ్యాచ్‌లో న్యూజీలాండ్ జట్టుకు టీమ్ సౌథీ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. రెగ్యూలర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ వైద్యుడి అపాయింట్‌మెంట్ ఉండటంతో మ్యాచ్‌కు దూరంకావాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌ టీమిండియా వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్‌కు కీలకంగా మారింది. గతకొన్ని మ్యాచ్ లలో పంత్ పేలువ ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఆదివారం జరిగిన మ్యాచ్ లోనూ పంత్ ఓపెనర్‌గా బరిలోకిదిగి విఫలమయ్యాడు. నిర్ణయాత్మక మ్యాచ్‌లోనైనా పంత్ చెలరేగుతాడేమో చూడాల్సిందే. మరోవైపు రెండో టీ20 మ్యాచ్‌లో సంజూ శాంసన్‌కు అవకాశం కల్పించలేదు. ఈ సిరీస్‌లోని ప్రతి మ్యాచ్‌లో సంజూకి అవకాశం వస్తుందని అందరూ భావించారు, అయితే, చివరి మ్యాచ్‌లో రిషబ్ పంత్‌ను తప్పించి సంజుకు అవకాశం ఇచ్చేఅవకాశాలు ఉన్నట్లు సమాచారం.

నిర్ణయాత్మక టీ20మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదనే చెప్పాలి. నేపియర్‌లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. స్వల్ప వర్ష సూచనలు ఉన్నాయి. కానీ ఆట రద్దయ్యే స్థాయిలో వర్షం పడే అవకాశాలు చాలా తక్కువ అని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ మ్యాచ్ లో అందరిచూపు సూర్యకుమార్ పైనే ఉంది. ముఖ్యంగా సూర్యకుమార్ బ్యాటింగ్ అంటేనే న్యూజీలాండ్ బౌలర్లలో ఓ భయంపట్టుకుంది. టీ20 రెండో మ్యాచ్ లో సూర్యకుమార్ సెంచరీతో పరుగుల వరద పారించాడు. నేడు జరిగే మ్యాచ్‌లో కూడా సూర్య క్రిజ్‌లో ఎక్కువ‌‌సేపుఉంటే కివీస్ బౌలర్లకు కష్టాలేనని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే, సూర్యకుమార్‌ను తొందరగా పెవిలియన్ బాట పట్టించేందుకు కివీస్ బౌలర్లు అస్త్రాలను సిద్ధంచేసుకున్నట్లు తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు