Today Headlines : ఆరోసారి ప్రపంచ విజేత ఆస్ట్రేలియా.. రెస్క్యూ ఆపరేషన్‌.. రోడ్‌ టెర్రర్‌

ఇందిరమ్మ రాజ్యంలో ఆకలి చావులే ఉన్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. 50ఏళ్లలో కాంగ్రెస్‌ ఏం చేసిందో ఆలోచించాలని తెలంగాణ ప్రజల్ని కోరారు.

ఆరోసారి ప్రపంచ విజేత ఆస్ట్రేలియా

ప్రపంచ కప్ ఫైనల్ లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఆరు వికెట్ల తేడాతో ఇండియాపై విజయ ఢంకా మోగించి ప్రపంచ కప్పును ముద్దాడింది. కాగా, ప్రపంచ కప్పును ఆస్ట్రేలియా గెలుచుకోవడం ఇది ఆరోసారి.

ఇందిరమ్మ రాజ్యంలో ఆకలిచావులే: KCR
ఇందిరమ్మ రాజ్యంలో ఆకలి చావులే ఉన్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. 50ఏళ్లలో కాంగ్రెస్‌ ఏం చేసిందో ఆలోచించాలని తెలంగాణ ప్రజల్ని కోరారు.

BRS డిపాజిట్లు గల్లంతు: ఈటల
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ డిపాజిట్లు గల్లంతు అవుతాయని భారతీయ జనతా పార్టీ నేత ఈటల రాజేందర్ అన్నారు. కేసీఆర్ పూర్తిగా డబ్బు, పోలీసులను నమ్ముకున్నారని ఆయన విమర్శలు గుప్పించారు.

సామాన్యుడికి భూస్వామికి మధ్య యుద్ధం
ఈ ఎన్నికలెు సామాన్యుడికి భూస్వామికి మధ్య కొనసాగుతున్న యుద్ధమని భారతీయ జనతా పార్టీ నేత బండి సంజయ్ అన్నారు. నారాయణఖేడ్‌లో రంగస్థలం మొదలైందని, ఇక రణమేనని ఆయన అన్నారు.

అభివృద్ధి కావాలంటే బీజేపీ రావాలి
అభివృద్ధి కావాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. రాష్ట్రంలో కమలం ప్రభుత్వం ఏర్పడగానే అవినీతిని కూకటివేళ్లతో పెకిలిస్తామని ఆయన అన్నారు. అంతకు ముందు ఒక సభలో అమిత్ షా మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వ అవినీతిపై విచారణ చేస్తామని అన్నారు.

బాబు అవినీతిలో పురందేశ్వరికి వాటా
చంద్రబాబు అవినీతిలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ పురందేశ్వరికి వాటాలందాయని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. వైసీపీపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించబోమని ఆయన కౌంటర్‌ ఇచ్చారు.

బీఆర్ఎస్ పార్టీపై షబ్బీర్ అలీ హాట్ కామెంట్స్
భారత్ రాష్ట్ర సమితి పార్టీపై కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ లో ఏక్‭నాథ్ షిండేలు తయారయ్యారని, పార్టీ మూడు ముక్కలు కావాదం ఖాయమని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుతున్నారని, కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. ఇక బీఆర్ఎస్ ముగినే నావని, బీజేపీకి సింగిల్ డిజిట్ కూడా రాదని షబ్బీర్ అలీ ఎద్దేవా చేశారు.

గాజాకు రెండో విడత మానవతా సహాయం పంపిన భారత్‌
యుద్ధం నేపథ్యంలో తీవ్ర సంక్షోభంలో పడిన గాజాకు భారత్ రెండో విడత మానవతా సహాయాన్ని పంపింది. సుమారు 32 టన్నుల సహాయ సామగ్రితో ఢిల్లీ నుంచి విమానం బయల్దేరింది. గాజాలో ఉన్న వారికి ఈ సహాయాన్ని అందిస్తారు.

BRS, BJP ఒక్కటేనన్న ప్రియాంక
భారతీయ జనతా పార్టీ, భారత్ రాష్ట్ర సమితి ఒక్కటేనని కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆదివారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో ఆమె మాట్లాడుతూ కేసీఆర్‌ పాలనలో పేదలు బాగుపడలేని విమర్శలు గుప్పించారు.

తప్పిన ముప్పు..
ఢిల్లీ రోహిణి సెక్టార్‌లో ఎలక్ర్టిక్‌ బస్సు బోల్తా పడింది. స్వల్ప గాయాలతో ప్రయాణికులు బయటపడ్డారు.

బోయలను బీసీల్లో కలిపింది కాంగ్రెస్సే
బోయలను బీసీల్లో కలిపింది కాంగ్రెస్ పార్టీయేనని మంత్రి కేటీఆర్ అన్నారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తే వారిని గిరిజనులుగా ప్రకటిస్తామని ఆయన అన్నారు. బీసీ భరోసా సభలో కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు.

రోడ్‌ టెర్రర్‌ ..
రాజస్థాన్‌లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కారును డీసీఎం ఢీకొని ఐదుగురు పోలీసులు మృతి చెందారు..

కాంగ్రెస్‌కు కౌంటర్‌..
కాంగ్రెస్‌కు అధికారంపై తప్ప అభివృద్ధిపై ధ్యాసలేదని, పచ్చబడిన తెలంగాణను ఆగం కానివ్వొద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు.

గులాబీ గూటికి ..
బీజేపీ ఆందోల్ అభ్యర్థి బాబూమోహన్‌ కుమారుడు ఉదయ్ బాబూ మోహన్ BRS పార్టీలో చేరారు. మంత్రి హరీష్ రావు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.

విశ్వ సుందరి ..
మిస్ యూనివర్శ్ 2023 కిరీటాన్ని నికరాగ్వా అందాల భామ షెన్నిస్ పలాసియోస్ కైవసం చేసుకుంది. థాయ్‌లాండ్‌కు చెందిన సుందరి ఆంటోనియా పోర్సిల్డ్ రన్నరప్‌గా నిలవగా, ఆస్ట్రేలియాకు చెందిన మోరయా విల్సన్ రెండో రన్నరప్‌గా ఎంపికయ్యారు. పోటీల్లో 84 దేశాలకు చెందిన యువతులు పాల్గొన్నారు.

పాలసముద్రం ..
పాలసముద్రాన్ని తలపించేలా మంచు అందాలు పాడేరు, వంజంగిలో పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి.

వేధింపులకు బలి ..
నిజామాబాద్ అర్బన్ ఇండిపెండెంట్ అభ్యర్థి బలవన్మరణం చెందారు. సైబర్‌ నేరగాళ్ల వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు తెలిపారు.

రెస్క్యూ ఆపరేషన్‌ ..
ఉత్తరాఖండ్‌లో రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది. కార్మికులను కాపాడేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి.