Top Headlines : బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్ట్.. వైసీపీ ప్రభుత్వానికి ఇక 3 నెలలే

సీఎం జగన్ పాలనలో అమరావతి పూర్తిగా నిర్వీర్యమైపోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతి విధ్యంసమైపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Today Headlines in Telugu at 11PM

పోలీసులు అదుపులో బిగ్ బాస్ విన్నర్
బిగ్ బాస్ సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. గజ్వేల్ లో అతడిని అదుపులోకి తీసుకున్నారు. బిగ్ బాస్ ఫైనల్ అనంతరం జరిగిన వాహనాల ధ్వంసం, అల్లర్లపై పోలీసులు పల్లవి ప్రశాంత్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ ఫైనల్ తర్వాత పల్లవి ప్రశాంత్ అభిమానులు రెచ్చిపోయారని, ప్రభుత్వ ప్రైవేట్ వాహనాలు ధ్వంసం చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. వీడియోలు, సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా దాడులకు పాల్పడ్డ వారిని గుర్తిస్తున్నారు.

కొత్త పార్లమెంట్‭లో లేడీస్ వాష్‭రూంలు భయంకరంగా ఉన్నాయట
కొత్త పార్లమెంట్ భవనంలో లేడీస్ వాష్‭రూంలు భయంకరంగా ఉన్నాయని సమాజ్‭వాదీ పార్టీ నేత, రాజ్యసభ ఎంపీ జయా బచ్చన్ సంచలన ఆరోపణ చేశారు. 143 మంది పార్లమెంట్ ఎంపీలను సస్పెండ్ చేయడంపై పార్లమెంట్ బయట విపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఆ ఆందోళనలో పాల్గొన్న జయా బచ్చన్.. మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా రాజ్యసభ చైర్మన్ జగ్‭దీప్ ధన్‭కఢ్‭ తనను మాట్లాడనివ్వలేదంటూ జయా బచ్చన్ విమర్శలు గుప్పించారు.

అమరావతి పూర్తిగా నిర్వీర్యమైపోయింది
సీఎం జగన్ పాలనలో అమరావతి పూర్తిగా నిర్వీర్యమైపోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతి విధ్యంసమైపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా విజయనగరం జిల్లా పోలిపల్లి వద్ద యువగళం-నవశకం పేరుతో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో చంద్రబాబు మాట్లాడారు.

ఇక మూడు నెలలే
వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు నారా లోకేశ్. విశాఖ‌ని క్యాపిట‌ల్ చేస్తానంటూ క్రైమ్ క్యాపిట‌ల్ చేశారు. పరిపాల‌నా రాజ‌ధాని చేస్తాన‌ని క‌బ్జాల రాజ‌ధాని చేశారు. భూములు, చెరువులను కబ్జా చేశారు. వైసీపీ నాయకులు కోట్లు కొట్టేశారు అంటూ విరుచుకుపడ్డారు నారా లోకేశ్. ఇక మూడు నెలలే, వైసీపీకి అంతియ యాత్ర డేట్ ఫిక్స్ అయ్యింది అంటూ యువగళం-నవశకం బహిరంగ సభలో జగన్ సర్కార్ పై చెలరేగిపోయారు నారా లోకేశ్.

అప్పుడు నాకు చాలా బాధ కలిగింది
చంద్రబాబుని జైల్లో పెట్టినప్పుడు తనకు చాలా బాధ కలిగిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పారు. రాజకీయాల్లో చంద్రబాబుకి సుదీర్ఘ అనుభవం ఉందని అన్నారు. గతంలో కేంద్రంలోనూ గొప్ప పాత్ర పోషించారని చెప్పారు. చంద్రబాబు నాయుడిపై వైసీపీ కక్ష సాధింపు చర్యలకు దిగిందని అన్నారు. ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు ఆయనకు మద్దతు తెలపాలనుకున్నానని చెప్పారు.

ఓవైసీ సాబ్ కూడా నవ్వుతున్నారు
పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం లోక్‌సభలో క్రిమినల్ లాకు సంబంధించి మూడు బిల్లులను ప్రవేశపెట్టారు. ఈ మూడు బిల్లులు వాయిస్ ఓటింగ్ ద్వారా ఆమోదం పొందాయి. ఇప్పుడు ఈ మూడు బిల్లులను రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. బిల్లును సమర్పిస్తున్న సందర్భంగా అమిత్ షా మాట్లాడారు. అయితే మధ్యలో హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీపై ఆయన మండిపడ్డారు.

ఉచితాల మాయలో పడొద్దు
వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు టీడీపీ ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ. సీఎం జగన్ అన్ని రకాలుగా రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారని బాలకృష్ణ మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు బుధ్ధి చెప్పాలని బాలకృష్ణ పిలుపునిచ్చారు. వైసీపీలో సామాజిక న్యాయం లేదన్నారు.

టీడీపీ, జనసేన కార్యకర్తలకు అభినందనలు: నాదెండ్ల మనోహర్
జగన్ పాలనలో అవమానాలు, వేధింపులకు గురయ్యామని, టీడీపీతో పొత్తుపై పవన్ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. లోకేష్ నాయకత్వాన్ని బలపరచాలంటే యువగళం సభకు వెళ్లడం సబబు కాదని పవన్ భావించారని, కానీ లోకేష్ స్పందించిన తీరు పవన్‌ను కదిలించిందని ఆయన అన్నారు.

కాళేశ్వరం కాక..
అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టు కాకపుట్టిస్తోంది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. కాళేశ్వరం. కాళేశ్వరాన్ని 80వేల కోట్లతో కట్టామనడం అబద్దమన్న సీఎం రేవంత్‌ అంటుంటే..సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలంటూ హరీశ్‌రావు సవాల్‌ విసిరారు. అలాగే ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక శ్వేతపత్రంపై అధికార-విపక్షాల మధ్యమాటల యుద్ధం కొనసాగుతోంది. లెక్కలను తమకు అనుకూలంగా రాసుకున్నారని BRS అంటుంటే..లెక్కలు తేలుస్తాం అంటూ ప్రతిపక్షానికి కౌంటర్ ఇస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం.

అసెంబ్లీలో ఆర్థిక శ్వేతపత్రంపై రగడ..
ఆర్థిక శ్వేతపత్రంపై తెలంగాణ అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. గత పదేళ్లలో బీఆర్ఎస్ పాలనలో ఆర్థిక విధ్వంసం జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తు..తెలంగాణ రాష్ట్రం మొత్తం అప్పు 6లక్షల71 వేల కోట్లు అని ఆర్థిక శ్వేతపత్రాన్ని సభలో ప్రవేశపెట్టింది. కానీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్వేతపత్రంలో ఎన్నో అవాస్తవాలున్నాయని ప్రతిపక్ష నేత..హరీశ్ రావు విమర్శించారు. గతప్రభుత్వాన్ని తప్పుబట్టడమే లక్ష్యంగా శ్వేతపత్రం ఉందని అన్నారు.

అన్నీ తప్పులే..
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆర్థిక విధ్వంసం జరిగిందని..ఆర్థిక అరాచకాలు జరిగాయని విమర్శిస్తు ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో దీనికి సంబంధించి 42 పేజీల శ్వేత పత్రాన్ని విడుదల చేసింది. దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శలు చేశారు. లెక్కలన్నీ తప్పుల తడకలేనని ..ప్రభుత్వం తనకు అనుకూలంగా రాజుకుంది అంటూ విమర్శించారు.

చిట్టిబాబుకే సీటివ్వాలి..
ఏపీలో టిక్కెట్ల రగడ కొనసాగుతోంది. వైసీపీ అధినేత వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం సిట్టింగ్ లను మార్చేస్తున్నారు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలో లబోదిబోమంటున్నారు. దీంట్లో భఆగంగా పి.గన్నవరం వైసీపీలో రాజీకీయం వేడికెక్కింది. ఎమ్మెల్యే చిట్టిబాబుకి టికెట్‌ ఇవ్వాలని అనుచరుల ఆందోళన చేపట్టారు. సీఎంవద్దే తేల్చుకుంటామంటున్నారు.

వరద..పాట్లు
తమిళనాడులో వర్షాలు తగ్గినా వరదలతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లన్నీ నదుల్ని తలపిస్తున్నాయి. ఎక్కడ రోడ్డు ఉందో…ఏమో తెలియని పరిస్థితి నెలకొంది.
నడుము లోతు నీళ్లతో జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు.

ప్రజలకు తెలియాలి
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ కొనసాగుతున్న క్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేశారు. నీళ్లు,నిధులు, నియామాకాల డిమాండ్ తో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని..రాష్ట్రం సాధించాక పదేళ్ల పాలించిన బీఆర్ఎస్ పాలనలో ఆర్థిక విధ్వంసం జరిగిందని తెలిపారు. ఈ పదేళ్లలో జరిగిన ఆర్థిక అరాచకాలు…తప్పిదాలు ప్రజలు తెలియాలని అన్నారు.

మత్తును దించేద్దాం..
డ్రగ్స్ మాఫియాకు.. మత్తుపదార్ధాలు వినియోగించేవారికి డీజీపీ రవిగుప్తా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుదామని..డ్రగ్స్ ను తరిమికొట్టేందుకు అందరం ఏకమవుదాం అంటూ పిలుపునిచ్చారు.

ట్రంప్‌కు షాక్‌
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌కు భారీ షాక్ తగిలింది. కొలరాడో నుంచి పోటీ చేయకుండా అనర్హత వేటు పడింది.

ఇదేనా ప్రజాస్వామ్యం..!
పార్లమెంట్‌ నుంచి ఎంపీల సస్పెన్షన్‌పై సోనియా సీరియస్‌ అయ్యారు. బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది అంటూ మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వం అపహాస్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు.

సర్వం సిద్ధం
తిరుమలలో వైకుంఠద్వార దర్శనానికి టీటీడీ సర్వం సిద్ధం చేసింది. డిసెంబర్ 23 నుంచి భక్తులకు కల్పించనున్న వైకుంఠద్వార దర్శనానికి విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.

అడవుల్లో పేలుతున్న తుపాకులు
ఛత్తీస్ గఢ్ అడవుల్లో మరోసారి తుపాకులు ఘర్జిస్తున్నాయి. నాగారం,కొత్తపల్లి అడవుల్లో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో పోలీసులు కూబింగ్ నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో చింతల్నార్ పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. పోలీసుల కాల్పుల్లో పలువురు మావోయిస్టులు చనిపోయినట్లుగా తెలుస్తోంది. మావోల క్యాంపుల నుంచి పోలీసులు భారీగా పేలుడు పదార్ధాలను గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకున్నారు.

విదేశీ విద్యాదీవెన..
విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న అర్హులైన 390 మంది విద్యార్థులకు రూ. 41.6 కోట్లను, సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన 95 మంది, వారిలో తిరిగి మెయిన్స్ లో ఉత్తీర్ణత సాధించిన 11 మంది అభ్యర్థులకు ప్రోత్సాహకంగా రూ. 100.5 లక్షలను మొత్తం రూ.42.6కోట్లను సీఎం జగన్ మోహన్ రెడ్డి బుధవారం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి వారి ఖాతాల్లో నేరుగా జమ చేశారు.

ఐఏఎస్ లకు పోస్టింగ్ లు..
ఏపీలో శిక్షణ పూర్తి చేసుకున్న పలువురు ఐఎఎస్‌లకు పోస్టింగ్‌ ఇచ్చారు. మరికొందరు ఐఏఎస్‌లను బదిలీ చేశారు. మొత్తం 17 మంది ఐఏఎస్‌లకు బదిలీలు, పోస్టింగులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐఏఎస్‌ ట్రైనింగ్‌ పూర్తయిన వారిని వివిధ జిల్లాలకు సబ్‌ కలెక్టర్లుగా నియమించారు.

పోలీసుల ఆంక్షలు ..
న్యూఇయర్‌ సెలబ్రేషన్స్‌పై హైదరాబాద్‌ పోలీసులు ఆంక్షలు విధించారు. కొత్త సంవత్సరం వేడుకలను డిసెంబర్‌ 31 రాత్రి ఒంటిగంట లోపు ముగించాలని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ప‌బ్‌లు, రెస్టారెంట్లతోపాటు ఈవెంట్ నిర్వాహ‌కులు 10రోజుల ముందే అనుమ‌తి తీసుకోవాలన్నారు. ప్రతి ఈవెంట్‌లో సీసీ కెమెరాలు, సెక్యూరిటీని త‌ప్పక ఏర్పాటు చేయాలని సూచించారు. 45 డెసిబెల్స్‌కు మించి ఎక్కువ శ‌బ్దం ఉండొద్దని పోలీసులు ఆంక్షలు విధించారు. ఈవెంట్ సామ‌ర్థ్యానికి మించి పాసులు ఇవ్వొద్దని ఆదేశించారు.