Today Headlines: అలంపూర్ లో అర్ధరాత్రి హైటెన్షన్.. నేటి నుంచి నారా లోకేష్ యువగళం పాదయాత్ర పున:ప్రారంభం

జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ లో అర్ధరాత్రి హైటెన్షన్ నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ కుమార్ ఇంట్లో ఐటీ, విజిలెన్స్ అధికారలమంటూ కొందరు దాడులు నిర్వహించారు. టీడీపీ నేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేటి నుంచి పున:ప్రారంభం కానుంది.

head lines 8

కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ కుమార్ ఇంట్లో ఐటీ, విజిలెన్స్ అధికారలమంటూ దాడులు
జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ లో అర్ధరాత్రి హైటెన్షన్ నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ కుమార్ ఇంట్లో ఐటీ, విజిలెన్స్ అధికారలమంటూ కొందరు దాడులు నిర్వహించారు. అడ్డుకోబోయిన వారిని నెట్టేసి సంపత్ కుమార్ ఇంట్లోకి ప్రవేశించారు. ఇంట్లోలోకి దూసుకెళ్లి హల్ చల్ చేశారు. ఇంట్లోని వస్తువులు, బట్టలు, సామాగ్రిని చిందరవందరగా పడేశారు. దీంతో వారిని

సెర్చ్ వారెంట్ చూపాలని సంపత్ కుమార్ సతీమణి మహాలక్ష్మీ వారిని నిలదీశారు. దీంతో సంపత్ కుమార్ సతీమణికి, వచ్చిన వారికి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ తోపులాటలో సంపత్ కుమార్ సతీమణి సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో హుటాహుటినా ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. వచ్చిన వారిని నిర్బంధించేందుకు సంతప్ కుమార్ అనుయాయులు ప్రయత్నించారు. ఆయన అనుయాయులు నిలదీయడంతో పరార్ అయ్యారు.

నారా లోకేష్ యువగళం పాదయాత్ర పున:ప్రారంభం
టీడీపీ నేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేటి నుంచి పున:ప్రారంభం కానుంది. చంద్రబాబు అరెస్ట్ కారణంగా తాత్కాలిక విరమం ప్రకటించిన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం పొదలాడ నుంచే ఉదయం 10గంటల 19నిమిషాలకు పాదయాత్ర ప్రారంభం కానుంది.

ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం
ఆస్ట్రేలియాతో రెండో టీ20 మ్యాచ్ లో భారత్ 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 236 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఆసీస్ 20 ఓవర్లలో 191/9 పరుగులే చేసింది. ఈ విజయంతో 5 టీ20ల సిరీస్ లో టీమిండియా 2-0తో లీడ్ లో ఉంది.


వాళ్లని గెలిపిస్తే మెడకు ఉరే, మీ భూములు గోవిందా

సిద్ధిపేట జిల్లా దుబ్బాకలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేశారు. కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు కేసీఆర్. తెలంగాణ ఇవ్వకుండా మోసం చేసిన పార్టీ అంటూ కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు కేసీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతు మెడకు ఉరి తప్పదని హెచ్చరించారు.

హిందూ రాష్ట్రం ఏర్పడిందట
రైట్ వింగ్ సంస్థలు తరుచూ హిందూ రాష్ట్రం గురించి మాట్లాడటం సాధారణమే. ఈ వరుసలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) తన గొంతుకను చాలా బలంగా ఇస్తుంటుంది. ఇంతకీ అదెప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, ఎలా గుర్తించాలనే విషయమై మాత్రం ఇప్పటి వరకు ఎవరూ చెప్పలేదు. అయితే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఉన్నట్టుండి హిందూ రాష్ట్రం ఏర్పడిందంటూ వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఆదివారం (నవంబర్ 26) జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ భారతదేశం ఇప్పటికే హిందూ దేశమని, మనం దానిని గుర్తించాలని అన్నారు.

నో కాంప్రమైజ్‌
తెలంగాణలో బీఆర్ఎస్.. కేంద్రంలో బీజేపీని ఓడించడమే తమ లక్ష్యమని, ఆ రెండు పార్టీలను ఓడించే వరకు ఎట్టిపరిస్థితుల్లో కాంప్రమైజ్ కాబోమని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు.

ఓట‌మి భ‌యంతోనే..
సీఎం కేసీఆర్ రెండో స్థానం నుంచి ఎందుకు పోటీ చేస్తున్నారో ఆలోచించాల‌ని ప్ర‌ధాని మోదీ సూచించారు. ఓట‌మి భ‌యంతోనే ఆయ‌న రెండు చోట్ల పోటీ చేస్తున్నార‌న్నారు. మెద‌క్ జిల్లా తూఫ్రాన్‌లో నిర్వ‌హించిన బహిరంగ స‌భ‌లో మోదీ మాట్లాడారు. గ‌జ్వేల్‌లో పోటీ చేస్తున్న బీజేపీ సింహం ఈట రాజేంద‌ర్‌ను చూసి కేసీఆర్ భ‌య‌ప‌డ్డార‌న్నారు.

పేప‌ర్ల లీక్‌..
సంగారెడ్డి ఎన్నిక‌ల ప్ర‌చారంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ప్ర‌ధాని మోదీ, కేసీఆర్ లు క‌లిసి ప్ర‌జ‌ల జేబుల్లోని డ‌బ్బులు దోచుకుంటున్నార‌ని ఆరోపించారు. రాష్ట్రంలో 8 వేల మంది రైతులు ఆత్మ‌హ‌త్య చేసుకున్నార‌న్నారు. యువ‌త‌కు ఉద్యోగాలు రాలేద‌ని, ల‌క్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం క్యూలో ఉన్నార‌న్నారు. పేప‌ర్ల లీక్‌తో యువ‌త న‌ష్ట‌పోయార‌న్నారు.

మొహాలిలో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు
పంజాబ్ రాష్ట్రంలోని మొహాలిలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా పోలీసుల మీదే కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారీ అయ్యారు.

వారొస్తే అంతే
కాంగ్రెస్‌ గెలిచాక కర్ణాటక ఆగమైందని మంత్రి హరీశ్ రావు అన్నారు. తెలంగాణలో వారొస్తే మళ్లీ కర్ఫ్యూలు, కరెంట్‌ కోతలే ఉంటాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండి మరోసారి కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని హరీశ్ రావు కోరారు.

మీదే నిర్ణయం
తెలంగాణ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని కేంద్ర మంత్రి అమిత్ షా విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్‌ను నిర్ణయించేవని తెలిపారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రజలంతా బీజేపీకి అండగా నిలవాలని అన్నారు.

ఖానాపూర్ సభలో కేసీఆర్..
కాంగ్రెస్ పాలనలో తాగునీరు కూడా ఇవ్వలేదని సీఎం కేసీఆర్ అన్నారు. ఆదివారం ఖానాపూర్ నియోజకవర్గంలో ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పాలనలో సంక్షేమం ఎలా జరిగిందో.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సంక్షేమం ఎలా జరుగుతుందో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు.

ప్రజల స్పందన లేదు..
టీడీపీ అధికారంలోకి వస్తే విపక్షాలపై వైసీపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేస్తామని టీడీపీ నేత బుద్ధా వెంకన్న అన్నారు. వైసీపీ బస్సు యాత్రకు ప్రజల నుంచి స్పందన లేదని ఎద్దేవా చేశారు. లోకేశ్ పాదయాత్రలో టీడీపీ, జనసేన శ్రేణులు పాల్గొంటారని చెప్పారు.

పుష్పా సీన్‌..
సంగారెడ్డి జిల్లాలో కూరగాయల మాటున గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూ. 3కోట్ల విలువైన సరుకు సీజ్‌ చేసి, ముగ్గురిని అరెస్టు చేశారు.

పొగమంచు ఎఫెక్ట్‌ ..
పంజాబ్‌, లూథియానా నేషనల్‌ హైవేపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పొగమంచు కారణంగా పదుల సంఖ్యలో వాహనాలు ఒకదానికొకటి ఢీకున్నాయి.

కారు దగ్దం..
ఆదిభట్ల ఔటర్ రింగ్ రోడ్డుపై కారు దగ్ధమైంది. కారులో ఒక్కసారిగా మంటలు రావడంతో అందులోని వ్యక్తి సజీవదహనం అయ్యాడు. మృతుడు కోదాడకు చెందిన వెంకటేశ్ గా అనుమానిస్తున్నారు.

నమో వెంకటేశ ..
ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ రాత్రి తిరుమలకు వెళ్లనున్నారు. సోమవారం ఉదయం శ్రీవారిని మోదీ దర్శించుకుంటారు. ఆదివారం సాయంత్రం మోదీ తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి తిరుమల వెళ్లి రాత్రి అక్కడే బస చేస్తారు. ఉదయం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుంటారు. ఎయిర్ పోర్టులో ప్రధాని మోదీకి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్వాగతం పలకనున్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా తిరుమల కొండపైకి చేరుకునే రోడ్డు మార్గం వెంబడి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

రాజస్థాన్‌లో 74.13 శాతం పోలింగ్‌ ..
రాజస్థాన్ రాష్ట్రంలో శనివారం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగింది. 199 నియోజకవర్గాల్లో జరిగిన ఈ ఎన్నికల్లో 74.13శాతం పోలింగ్ నమోదైంది. తిజారాలో అత్యధికంగా 85.15 శాతం పోలింగ్ నమోదైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్థాన్ లో 74.06శాతం పోలింగ్ నమోదైంది. ఇదిలాఉంటే డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.

ఈసీకి ఫిర్యాదుల వెల్లువ ..
తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌ను పలు పార్టీల నేతలు కలిసి ఫిర్యాదులు చేశారు. కర్ణాటక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ప్రకటనలు ఇస్తోందని బీజేపీ ఎంపీ ప్రకాశ్ జావడేకర్‌ ఫిర్యాదు చేశారు. కర్ణాటక ప్రజల నిధులను తెలంగాణలో ఎలా ఖర్చు చేస్తారని జావడేకర్‌ ప్రశ్నించారు. BRS పార్టీ ఈ నెల 21వ తేదీన న్యూస్‌ పేపర్లలో ఇచ్చిన ప్రకటనలపై సీఈవో వికాస్ రాజ్‌కు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. BRS పార్టీ ఇచ్చిన ప్రకటనలు కాంగ్రెస్ పార్టీని కించపర్చేలా ఉన్నాయన్నారు.

ట్రెండింగ్ వార్తలు