Today Headlines : హరీశ్‌ వ్యాఖ్యల వల్లే రైతుబంధు ఆగిందన్న కాంగ్రెస్‌.. BRS, కాంగ్రెస్‌వి డ్రామాలన్న బీజేపీ

అధికారంలో ఉన్నప్పుడు రైతుల్ని గోస పెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా రైతుల్ని వేధిస్తోందని మంత్రి హరీశ్‭రావు విరుచుకుపడ్డారు.

బ‌ల‌వంతం చేయొద్దు
గతేడాది రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన టీమ్ఇండియా వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్ కోలుకుంటున్నాడు. ప్ర‌స్తుతం అత‌డు ఫిట్‌నెస్ సాధించే ప‌నిలో ఉన్నాడు. అయితే.. శ‌నివారం పంత్ సోష‌ల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ వైర‌ల్‌గా మారింది. త‌న ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పంత్ ఓ మెసేజ్‌ను పోస్ట్ చేశాడు. ‘స్నేహాం లేదా బంధాలు ఏదైనా కానివ్వండి. అవి కొన‌సాగుతున్నా లేదా విడిపోయిన‌ప్ప‌టికీ వాటిని బ‌ల‌వంతం చేయొద్దు.’ అని పంత్ పోస్ట్ చేశాడు. అయితే.. పంత్ ఎవ్వ‌రి పేరును చెప్ప‌లేదు. దీంతో అత‌డు ఎవ‌రిని ఉద్దేశించి ఈ పోస్ట్ చేశాడు అన్న చ‌ర్చ మొద‌లైంది.

పేటీఎం, ఫోన్‌పే బాటలో గూగుల్ పే
ప్రముఖ డిజిటల్ పేమెంట్ యాప్ గూగుల్ పే తమ యూజర్లకు షాకిచ్చింది. గూగుల్ పేలో యూపీఐ సర్వీసులను ఉపయోగించి తమ మొబైల్ ఫోన్‌లను రీఛార్జ్ చేయాలనుకునే వినియోగదారులపై అదనపు ఛార్జీలు వసూలు చేస్తోంది. గూగుల్ పేలో మొబైల్ రీఛార్జ్‌లపై కన్వీనియన్స్ ఫీజు విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ ఫీజు కింద వినియోగదారుల నుంచి ప్రతి రీఛార్జ్‌పై రూ. 3 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. గూగుల్ పే ద్వారా ప్రీపెయిడ్ ప్లాన్‌లను కొనుగోలు చేసినప్పుడు ఈ రుసుము వర్తిస్తుంది.

2019 సీన్ రిపీట్
2019లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో వర్షంలో తడుస్తూ శరద్ పవార్ చేసిన ప్రసంగం అప్పట్లో ఎన్సీపీని విజయ తీరాలకు తీసుకెళ్లిందని అంటుంటారు. ఆ సీన్ మరోసారి రిపీట్ అయిందని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు అంటున్నారు. సోమవారం నవీ ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో పవార్ మరోసారి వర్షంలో తడుస్తూ ప్రసంగించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఆయన ప్రసంగం ప్రారంభించగానే చిరు జల్లు ప్రారంభమైంది. అయితే ఆ జల్లుల్లోనే పవార్ తన ప్రసంగాన్ని కొనసాగించారు.

ఇందిరమ్మ రాజ్యం బాగుంటే.. ఎన్టీఆర్ ఎందుకు పార్టీ పెట్టారు?
‘‘ఇందిరమ్మ రాజ్యం సరిగా ఉంటే ఎన్టీఆర్ ఎందుకు పార్టీ పెట్టాల్సిన అవసరం వచ్చింది? ఎమ్మెల్యేగా లేకున్నా చింతా ప్రభాకర్ కరోనా సమయంలో ఎన్నో సేవలు చేశారు. 157 మెడికల్ కాలేజీలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఒక్కటి కూడా తెలంగాణకి ఇవ్వలేదు. వంద ఉత్తరాలు రాసినా ఒక్క నవోదయ స్కూల్ కూడా ఇవ్వలేదు. బీజేపీకి ఓటేస్తే మురికి కాలువలో వేసినట్టే. మార్చి తర్వాత సన్నబియ్యం పంపిణీ చేస్తాం” అని కేసీఆర్ అన్నారు.

ప్రతిపక్షంలో కూడా రైతులను వేధిస్తోంది
అధికారంలో ఉన్నప్పుడు రైతుల్ని గోస పెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా రైతుల్ని వేధిస్తోందని మంత్రి హరీశ్‭రావు విరుచుకుపడ్డారు. ఇరు పార్టీల మధ్య కరెంటు విషయమై మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో హరీశ్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ రైతు వ్యతిరేక పార్టేనని ఆయన అన్నారు. కాంగ్రెస్ పాలనలో కరెంట్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదని, అలాంటి పార్టీ ఇప్పుడు రైతులపై కపట ప్రేమ చుపిస్తోందని ఆయన ఎద్దేవా చేశారు.

ఓటర్ల కోసం కొత్త యాప్
హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కీలక వివరాలు వెల్లడించారు. 312మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని ఆయన తెలిపారు. అభ్యర్థులు రేపు (నవంబర్ 28) సాయంత్రం 5గంటల వరకు ప్రచారం చేసుకోవచ్చన్నారు. ఆ తర్వాత ప్రచారం బంద్ అవుతుందన్నారు. అన్ని అడ్వర్టైజ్ మెంట్స్ తొలగిస్తామన్నారు.

కేసీఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ ఖర్గే, రాహుల్
తెలంగాణలో నిరుద్యోగుల సమస్యలు, రైతుబంధు పంపిణీపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఈ విషయమై ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీలు తమ ఎక్స్ ఖాతా ద్వారా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విద్యార్థులు, నిరుద్యోగులతో కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు సిగ్గు చేటు అంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించగా.. రైతుబంధు లబ్దిదారులకు నగదు బదిలీ చేయాలని కాంగ్రెస్ పార్టీ కోరినప్పటికీ, కేసీఆర్ ప్రభుత్వ పెడచెవిన పెట్టిందని ఖర్గే విమర్శలు గుప్పించారు.

తెలుగులో నినాదాలు చేసిన ప్రియాంక గాంధీ

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో వరుస పర్యటనలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ జాతీయ జనరల్ సెక్రెటరీ ప్రియాంక గాంధీ వాద్రా.. సోమవారం కొడంగల్ పట్టణంలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్థి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ప్రియాంక ప్రశంసలు కురిపించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నినాదాన్ని ఆమె తెలుగులోనే సభికులతో కలిసి వినిపించారు. ‘మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి’ అంటూ ప్రియాంక నినాదాలు చేస్తుంటే సభకు వచ్చిన వారు ఉత్సాహంతో ఆమెతో గొంతు కలిపారు.

హైదరాబాద్‭లో ప్రధాని రోడ్ షో
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‭లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ భారీ రోడ్ షో నిర్వహించారు. నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి ప్రారంభమైన ఈ రోడ్ షో కాచీగూడ వరకు సాగింది. భారతీయ జనతా పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు దీనికి పెద్ద ఎత్తున హాజరై మోదీకి స్వాగతం పలికారు.

చేసి చూపిస్తాం
బీఆర్ఎస్ అంటే భ్రష్టాచార్‌ పార్టీ అంటూ ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీకి అధికారం ఇస్తే 10 ఏళ్లలో జరగని అభివృద్ధి ఐదేళ్లలో చేసి చూపిస్తామన్నారు. హుజురాబాద్‌లో ట్రైలర్ చూపించాం. .బీజేపీలో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతోందని ధీమా వ్యక్తంచేశారు. కరీంనగర్ సకల జనుల విజయసంకల్ప సభలో పాల్గొన్న మోదీ ‘‘నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికి ధన్యవాదాలు’’ అంటూ ప్రసంగాన్ని మొదలు పెట్టి ప్రజల్లో జోష్ నింపారు.

బీ కేర్‌ ఫుల్‌
తెలంగాణ ప్రతిష్టను పెంచేది బీజేపీ మాత్రమే .. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌తో జాగ్రత్తగా ఉండాలి అంటూ ప్రధాని మోదీ ప్రజలకు సూచించారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ బీఆర్ఎస్, కాంగ్రెస్ లపై ఘాటు విమర్శలతో విరుచుకుపడుతున్నారు.

రైతుబంధు రగడ..
హరీశ్‌ వ్యాఖ్యల వల్లే రైతుబంధు ఆగింది అంటూ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కానీ కాంగ్రెస్ దురుద్ధేశ్యంతోనే ఈసీకి ఫిర్యాదులు చేసిన రైతు బంధుని ఆపివేసేలా చేసిందంటూ బీఆర్ఎస్ విమర్శిస్తోంది. రైతు బంధు విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ లు ఇద్దరివి డ్రామాలే అంటూ బీజేపీ ఏకిపారేస్తోంది.

ఆగదు.. ఆగదు..
రైతుబంధు డబ్బులు ఇవ్వొద్దని కాంగ్రెస్‌ అడ్డంకులు సృష్టిస్తోందని..కానీ తాను సీఎంగా ఉన్నంత వరకూ ఆగదని సీఎం KCR భరోసా ఇచ్చారు. అలాగే అన్నదాతకు సాయం అందకుండా కాంగ్రెస్‌ కుట్రలు చేస్తోందని..రైతులకు పంట పెట్టుబడి ఇస్తే ఎందుకు కడుపుమంట..? అంటూ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.

కమలం జోష్‌…
మరికాసేపట్లో హైదారాబాద్‌లో మోదీ రోడ్ షో ప్రారంభం కానుంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి కాచిగూడ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించనుంది కమలంపార్టీ.

సొంతగూటికి..
IPL వేలానికి ముందు కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ముంబై ఫ్రాంచైజీకి హార్ధిక్‌ పాండ్యా.. గుజరాత్‌ కెప్టెన్‌గా గిల్‌.

ఒక్క చాన్స్‌..ఎటాక్..కౌంటర్ ఎటాక్..
రెండుసార్లు అధికారమిచ్చినా BRS చేసిందేమీ లేదు అంటూ ప్రియాంకాగాంధీ విమర్శించారు. కాంగ్రెస్‌కు అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని భరోసా ఇచ్చారు. ఈక్రమంలో అవినీతిలో BRS, కాంగ్రెస్‌ బొమ్మాబొరుసు అంటూ జేపీ నడ్డా విరుచుకుపడ్డారు. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని అన్నారు. అలాగే కాంగ్రెస్‌, BRSకు ఓటేస్తే కుటుంబ పాలనే వస్తుందని కానీ బీజేపీకి ఓటు వేస్తే అభివద్ధి వస్తుందన్నారు. బీజేపీని గెలిపిస్తే తెలంగాణకు బీసీని సీఎం చేస్తామని హామీ ఇచ్చారు.

హైదరాబాద్‌ పేరు మారుమార్చేస్తాం..
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావటం ఖాయం అని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తంచేవారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక హైదరాబాద్ పేరును భాగ్యనగర్ గా మారుస్తామని అన్నారు. అస్సలు హైదర్ ఎవడు? ఎవరకి కావాలి హైదర్ ? అంటూ ప్రశ్నించారు. రైతు బంధు విడుదల విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు డ్రామాలాడుతున్నాయని విమర్శించారు. బీజేపీవి విద్వేష పూరిత రాజకీయాలు అని విమర్శించిన ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీపై కిషన్ రెడ్డి విరుచుకుపడ్డారు.

సజ్జల సెటైర్లు..విమర్శలు..
పక్క రాష్ట్రంలో ఉంటూ ఏపీలో పెత్తనం చెలాయిస్తారా..?అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబుపై సజ్జల ఘాటు విమర్శలు చేశారు. పవన్ కల్యాణ్ కి ఎలాంటి ప్రలోభాలు పెట్టారో పక్కన పెడితే…చంద్రబాబుకి 175 నియోజక వర్గాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు ఉన్నారా?అంటూ సెటైర్లు వేశారు.

ట్రెండింగ్ వార్తలు