Tollywood : మళ్ళీ తెరపైకి టాలీవుడ్ డ్రగ్స్ కేసు..సినీ స్టార్స్ కి ఈడీ సమన్లు

టాలీవుడ్ డ్రగ్స్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ సారి ఈడీ రంగంలోకి దిగింది. చార్మి, రకుల్ ప్రీత్ సింగ్, రాణా దగ్గుపాటి, రవితేజ తోపాటు మరికొందరికి సమన్లు జారీచేసింది ఈడీ.

Tollywood (2)

టాలీవుడ్ డ్రగ్స్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ సారి ఈడీ రంగంలోకి దిగింది. చార్మి, రకుల్ ప్రీత్ సింగ్, రాణా దగ్గుపాటి, రవితేజ, పూరి జగన్నాథ్, నవదీప్, ముమైత్ ఖాన్, తరుణ్, నందు, శ్రీనివాస్ కు ఈడీ సమన్లు జారీచేసింది.

2017 సంవత్సరంలో తెలుగు చిత్ర పరిశ్రమను ఒక కుదుపు కుదిపిన డ్రగ్స్ కేసు మరోసారి తెరమీదకు వచ్చింది. 2017లో 16 మందికి సంబందించిన గోర్లు, తల వెంట్రుకలను తీసుకోని FSL రిపోర్టుకు పంపించారు. అనంతరం ఈ కేసు విచారణలో వేగం తగ్గింది. ఈ నేపథ్యంలోనే హైకోర్టులో ఫిటిషన్ దాఖలు అయింది. ఫోరమ్ ఫర్ గుడ్ గవెర్నెన్స్ కూడా అటు సిబిఐ అధికారులకు ఈడీ అధికారులకు ఒక లేఖను రాయడం జరిగింది. ఈ లేక ఆధారంగానే ఎన్ఫోర్మెంట్ అధికారులు రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది.

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నిజానిజాలను బయటకు తీసేందుకు ఈడీ అధికారులు ఈ కేసును తమ చేతుల్లోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆరోపణలు ఎదురుకుంటున్న వారికి నోటీసులు పంపారు అధికారులు. నోటీసులు అందుకున్నవారు వివరణ ఇవ్వాలని ఈడీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

సిట్ ఇచ్చిన నివేదిక, ఎక్షైఙ్ శాఖ జరిపిన విచారణ వివరాలను ఈడీ అధికారులు పరిశీలించిన తర్వాతనే వీరికి సమన్లు జారీచేసినట్లు సమాచారం. మరి ఈ నోటీసులపై సినీ తారలు ఏ విధంగా స్పందిస్తారు అనేది వేచి చూడక తప్పదు. కేసు మళ్ళీ తెరపైకి రావడం ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.

అయితే గతంలో విచారణకు హాజరైన వారిలో దగ్గుబాటి రాణా, రకుల్ ప్రీత్ సింగ్ లేరు. బాలీవుడ్ నటుడు సుశాంత్ రాజ్ పుత్ మరణం తర్వాత తెరపైకి వచ్చిన డ్రగ్స్ వ్యవహారంలో రకుల్ పేరు వినిపించింది. ఆమెతోపాటు మరికొందమంది నటీమణుల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే రకుల్ పేరు చేర్చినట్లు తెలుస్తుంది.

మరోవైపు కన్నడ పరిశ్రమలో తాజాగా డ్రగ్స్ వ్యవహారం బయటపడింది. FSL రిపోర్టులో నటి సంజన గల్రాని, రాగిణి ద్వివేది డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతుండగానే టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారం బయటకు రావడం ప్రకంపనలు సృష్టిస్తుంది.