Tiger Attack: బాబోయ్.. ఒక్కసారిగా దూసుకొచ్చింది.. పులిని దగ్గరగా చూడాలనుకుంటే ఇలానే ఉంటది..! వీడియో వైరల్
ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ (ఐఎఫఎస్) సురేందర్ మెహ్రా తన ట్విటర్ ఖాతాలో తరచుగా జంతువులకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తుంటారు. తాజాగా ఓ వీడియోను షేర్ చేసి.. "కొన్నిసార్లు పులిని చూడటంకోసం మన 'అతి' ఆత్రుత వాటి జీవితంలోకి చొరబడటం తప్ప మరొకటి కాదు" అంటూ శీర్షిక ఇచ్చాడు.
- Harishth Thanniru
- Published On : November 28, 2022 / 02:11 PM IST
Tiger
Tiger Attack: సింహాలు, పులులను దగ్గరగా చూడాలనుకుంటే పెద్ద సహసం చేసినట్లే అవుతుంది. అయినా చాలా మంది వాటిని దగ్గరగా చూసేందుకు ప్రయత్నం చేస్తుంటారు. ఈ తరహాలోనే ఓ పార్కులో టూరిస్టులు జీపుపై వెళ్తూ పులిని దగ్గరగా చూసేందుకు ప్రయత్నించారు. పులి ఒక్కసారిగా మీదకు దూసుకురావటంగా వాహనాన్ని వేగంగా పోనిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Viral Video: వావ్! హెయిర్ కట్ తర్వాత యువకుడిలా మారిపోయిన హోమ్‌లెస్ మ్యాన్.. క్రేజీ వీడియో!
ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ (ఐఎఫఎస్) సురేందర్ మెహ్రా తన ట్విటర్ ఖాతాలో తరచుగా జంతువులకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తుంటారు. తాజాగా ఓ వీడియోను షేర్ చేసి.. “కొన్నిసార్లు పులిని చూడటంకోసం మన ‘అతి’ ఆత్రుత వాటి జీవితంలోకి చొరబడటం తప్ప మరొకటి కాదు” అంటూ శీర్షిక ఇచ్చాడు. సురేందర్ పోస్టు చేసిన వీడియోలో జూ పార్కులో ఓపెన్ టాప్ జీపులో పర్యాటకుల బృందం ప్రయాణిస్తోంది. ఈ బృందం పొదలు వెనుక దాక్కున్న పులిని గుర్తించడంతో జీపును దాని దగ్గరకు వెళ్లి ఆపారు. పులిని దగ్గరగా ఫొటోలు తీసేందుకు ప్రయత్నించారు.. ఇంతలోనే పులి ఒక్కసారిగా పర్యటకులు కూర్చున్న వాహనంపైకి దూసుకొచ్చింది. జీప్ డ్రైవర్ వేగంగా వాహనాన్ని ముందుకు పోనివ్వడంతో పులి తిరిగి వెనక్కు వెళ్లిపోయింది.
Sometimes, our ‘too much’ eagerness for ‘Tiger sighting’ is nothing but intrusion in their Life…🐅#Wilderness #Wildlife #nature #RespectWildlife #KnowWildlife #ResponsibleTourism
Video: WA@susantananda3 @ntca_india pic.twitter.com/B8Gjv8UmgF— Surender Mehra IFS (@surenmehra) November 27, 2022
ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. అలాంటి వారిని అడవిలోకి ప్రవేశించకుండా నిషేధించాలని ఓ నెటిజన్లు వ్యాఖ్యానించగా.. పులిని దగ్గరగా చూడాలనుకుంటే ఇలానే ఉంటుంది అంటూ మరో నెటిజన్ వ్యాఖ్యానించాడు.
