Tribals Arrest: ప్రగతి భవన్ ముట్టడికి బయల్దేరిన గిరిజనులు.. అరెస్టు చేసిన పోలీసులు

తంలో సర్వే నెంబర్ 30, 36, 39లలో ఉన్న 570 ఎకరాల భూమికి సంబంధించి గిరిజనులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు గిరిజనులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో అధికారులు గిరిజనులకు పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చారు. అయితే, ఏళ్లు గడుస్తున్నా భూమికి సంబంధించి పొజిషన్ చూపించలేదు.

Tribals Arrest: పోడు భూముల సమస్యల పరిష్కారం కోరుతూ ప్రగతి భవన్ ముట్టడికి పాదయాత్రగా బయలుదేరిన గిరిజనులను అరెస్టు చేశారు పోలీసులు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం రామన్నగూడెం పరిధిలో సోమవారం జరిగింది. రామన్నగూడెం పంచాయతీ పరిధిలో గిరిజనులు 40 ఏళ్లుగా అటవీ ప్రాంతంలో పోడు భూములు సాగు చేసుకుంటున్నారు. 2012లో పోడు భూములపై ఫారెస్టు, రెవెన్యూ డిపార్ట్‌మెంట్ అధికారులు సర్వే నిర్వహిచారు. అయితే, అధికారులు ఈ సర్వే రిపోర్టును ఉన్నతాధికారులకు సమర్పించలేదు. దీంతో భూమిపై వివాదం నెలకొంది.

Secunderabad protests: సికింద్రాబాద్ అల్లర్లు.. బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన సుబ్బారావు

గతంలో సర్వే నెంబర్ 30, 36, 39లలో ఉన్న 570 ఎకరాల భూమికి సంబంధించి గిరిజనులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు గిరిజనులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో అధికారులు గిరిజనులకు పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చారు. అయితే, ఏళ్లు గడుస్తున్నా భూమికి సంబంధించి పొజిషన్ చూపించలేదు. దీంతో ఇంతకాలంగా భూమి కోసం గిరిజనులు పోరాటం చేస్తున్నారు. ఎంతోకాలంగా భూమి హక్కుల కోసం పోరాడుతన్నప్పటికీ, తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని, సీఎం కేసీఆర్‌ను కలిసి గోడు వెళ్లబోసుకోవాలని గిరిజనులు నిర్ణయించుకున్నారు. దీనికోసం గిరిజనులు ఛలో ప్రగతి భవన్‌కు పిలుపునిచ్చారు. స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర రావు, అశ్వారావు పేట ఎంపీపీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Jubilee Hills Rape Case: నిందితుల డీఎన్ఏ సేకరణకు పోలీసుల ఏర్పాట్లు

ఛలో ప్రగతి భవన్‌లో భాగంగా రామన్న గూడెం నుంచి గంగారాం వరకు గిరిజనులు పాదయాత్ర చేపట్టారు. గంగారాం వద్ద పోలీసులు వీరిని బలవంతంగా అరెస్టు చేశారు. అనంతరం దమ్మపేట, ముల్కలపల్లి పోలీసు స్టేషన్లకు తరలించారు. అక్కడి నుంచి పాల్వంచ పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు. కాగా, పాదయాత్ర చేస్తున్న గిరిజనుల అరెస్టుకు నిరసనగా, స్థానికులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ ఆందోళనలో మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కూడా పాల్గొన్నారు. పోడు భూముల హక్కుల కోసం పోరాడుతున్న గిరిజనుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని తాటి వెంకటేశ్వర్లు అన్నారు.

ట్రెండింగ్ వార్తలు