Trivikram: త్రివిక్రమ్‌కు పోలసుల ఝలక్..!
ఇటీవల హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు వరుసగా ఝలక్ ఇస్తూ వివిధ ఆంక్షల ఉల్లంఘనల కారణంగా భారీ జరిమానాలను విధిస్తున్న సంగతి తెలిసిందే...
- Anil Aaleti
- Published On : April 4, 2022 / 01:26 PM IST
Trivikram Fined By Hyderabad Traffic Police
Trivikram: ఇటీవల హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు వరుసగా ఝలక్ ఇస్తూ వివిధ ఆంక్షల ఉల్లంఘనల కారణంగా భారీ జరిమానాలను విధిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ట్రాఫిక్ పోలీసులు సామాన్య పౌరులతో పాటు సెలెబ్రిటీలను సైతం ఈ విషయంలో వదలడం లేదు. ఇప్పటికే అల్లు అర్జున్, మంచు మనోజ్, నందమూరి కళ్యాణ్ రామ్ లాంటి స్టార్స్ కు చెందిన కార్లకు బ్లాక్ ఫిల్మ్ ఉందన్న కారణంగా వారికి జరిమానా విధించారు.
Allu Arjun: అల్లు అర్జున్, కళ్యాణ్ రామ్ కార్లకు ఫైన్
అయితే తాజాగా వారి జాబితాలో ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ కూడా చేరారు. కార్లకు టింటెడ్ గ్లాసెస్ పై బ్లాక్ ఫిల్మ్ ఉండకూడదని సుప్రీం కోర్టు ఆంక్షలు విధించడంతో, వాహనదారులపై కొరడా ఝులిపిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. జూబ్లిహిల్స్ పరిధిలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు త్రివిక్రమ్ కారును అడ్డుకుని, ఆయన కారుకు ఉన్న బ్లాక్ ఫిల్మ్ ను తొలగించారు. ఆ తరువాత ఆయనకు రూ.700 జరిమానా విధించారు. కేవలం వై కేటగిరి వ్యక్తుల వాహనాలకు మాత్రమే బ్లాక్ ఫిల్మ్ ఉండాలని సుప్రీం కోర్టు ఆదేశించడంతో, మిగతావారి వాహనాలకు బ్లాక్ ఫిల్మ్ తీస్తూ జరిమానాలు విధిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు.
Allu Arjun: రూల్స్ బ్రేక్.. మొన్న తారక్.. ఇప్పుడు బన్నీ, కళ్యాణ్ రామ్!
ఇలా వరుసగా టాలీవుడ్ సెలెబ్రిటీల వాహనాలను తనిఖీ చేస్తూ.. ట్రాఫిక్ ఆంక్షలకు విరుద్ధంగా వారి వాహనాలకు బ్లాక్ ఫిల్మ్ ఉండటంతో ఈ విధంగా జరిమానాలు విధిస్తున్నారు. ఇక సెలెబ్రిటీలు ఎక్కువగా ఉండే జూబ్లిహిల్స్ ప్రాంతంలో ఈ తనిఖీలు ఎక్కువా జరుగుతున్నాయి.
