TSRTC: ఆర్టీసీ అదిరిపోయే ఆఫర్లు.. ఫ్రీ ట్రీట్మెంట్, ఫ్రీ జర్నీ

తెలంగాణ ఆర్టీసీ అద్భుతమైన ఆఫర్లు తీసుకొచ్చింది. 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ సందర్భంగా 12 రోజుల పాటు వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే ఆగస్టు 15వ తేదీన పుట్టిన చిన్నారులందరికీ వారికి 12ఏళ్ల పాటు రాష్ట్రంలోని అన్ని సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. టీనేజి చేరుకునేంతవరకూ ఫ్రీ జర్నీ అన్నమాట.

 

TSRTC: తెలంగాణ ఆర్టీసీ అద్భుతమైన ఆఫర్లు తీసుకొచ్చింది. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ సందర్భంగా 12 రోజుల పాటు వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే ఆగస్టు 15వ తేదీన పుట్టిన చిన్నారులందరికీ వారికి 12ఏళ్ల పాటు రాష్ట్రంలోని అన్ని సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. టీనేజి చేరుకునేంతవరకూ ఫ్రీ జర్నీ అన్నమాట.

ఇక 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారు ఆగష్టు 15న ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించుకోవచ్చు. అంతేకాదు మిగిలిన వారికి కూడా టీ- 24 బస్ టికెటును ఆ ఒక్క రోజున రూ. 75(సాధారణ రోజుల్లో రూ.120)కే విక్రయిస్తామని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఆగష్టు పదో తేదీ నుంచి 21వ తేదీ వరకు 12 రోజుల పాటు వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.

Read Also: టీఎస్ఆర్టీసీ ఛార్జీలు పెంపు వాయిదా

మంగళవారం నుంచి ఆర్టీసీకి చెందిన అన్ని ప్రాంతాల్లో ప్రతి రోజూ ఉదయం 11 గంటలకు జాతీయగీతాన్ని ఆలపిస్తారు. ఆగస్టు 13 నుంచి 15వ తేదీ వరకు అన్ని బస్సులకు జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఉద్యోగులంతా అమృతోత్సవ్ బ్యాడ్జీలతోనే విధులకు హాజరవుతారు.

Independence India Diamond Festival

మరికొన్ని కానుకలు ఇలా..

* 75 సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్లకు తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రిలో ఆగష్టు 15 నుంచి 22వ తేదీ వరకూ ఉచిత వైద్య పరీక్షలు. 75ఏళ్లు లోపు వారికి రూ.750లతో వైద్య పరీక్ష ప్యాకేజి.

* శంషాబాద్ విమానాశయానికి ఆగస్టు 15న పుష్పక్ ఎయిర్ పోర్ట్ సర్వీసును వినియోగించుకునే ప్రయాణికులకు 75శాతం మాత్రమే ఛార్జీలు

* టాప్-75 ప్రయాణికులకు ఒక ట్రిప్ టికెటు ఉచితం.

* ఆగస్టు 15న కార్గోలో ఒక కిలో పార్సిల్ 75 కిలోమీటర్ల వరకు ఉచిత రవాణా.

* తితిదే ప్యాకేజీని వినియోగించుకునే ప్రయాణికులకు ఆగష్టు 16 నుంచి 21 వరకు రూ.75 తగ్గింపు.

ట్రెండింగ్ వార్తలు